అమరావతి: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం ముఖ్యాంశాలు
అందరికీ ఇళ్లు-అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్థలాలకు ప్రాధాన్యం-రూ.500 కోట్లతో ప్రైవేట్ స్థలాల కొనుగోలు:
• రాష్ట్రంలో అర్హులందరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వాలని, అందుబాటులో వున్న ప్రభుత్వ స్థలాలను ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం.
• ఇప్పటికే వివిధ జిల్లాలలో వున్న పట్టణాలలో 71,862, గ్రామీణ ప్రాంతాలలో 2,19,696 మందికి ఇళ్లస్థలాలు కేటాయించాం.
• ఇవికాక మరో 17,785 మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి స్థలాలు అందుబాటులో వున్నాయి.
• ఇందులో కొందరు ఇప్పటికే ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలాలలో అనధికారికంగా ఇళ్లు నిర్మించుకుని వుంటున్నారు. అటువంటి స్థ్లలాలను క్రమబద్దీకరించడానికి చర్యలు తీసుకుంటున్నాం.
• మిగిలిన అర్హులందరికీ స్థలాలను కేటాయించడానికి బడ్జెటులో రూ.500 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ప్రైవేట్ స్థలాలను కొనగోలు చేసి అర్హులకు ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం.
• 10 అర్భన్ డెవలప్మెంట్ అథారిటీస్ పరిధిలో వున్న గ్రామాలలో అవసరమైన చోట్ల బహుళ అంతస్థుల ఇళ్ల నిర్మాణానికి మంత్రిమండలి నిర్ణయం.
తిరుపతిలో రూ.3వేల కోట్లతో ఇఎంసీ 2:
• రూ.2,827.5 కోట్ల వ్యయంతో 322 ఎకరాలలో తిరుపతిలో ఇఎంసీ2 అభివృద్ధి చేయడానికి మంత్రి మండలి నిర్ణయం.
• తిరుపతిలో వికృతమాల గ్రామంలో ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్(ఇఎంసీ) 2లో మౌలిక వసతుల కల్పించాలని మంత్రిమండలి నిర్ణయం.
• 52,930 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలగనున్నాయి. సెల్ ఫోన్ల తయారీతో పాటు ఎలక్ట్రానిక్ ఉపకరణాల తయారీకి ప్రోత్సాహం ఇస్తారు.
ఒంగోలు డెయిరీకి రూ.35 కోట్ల రుణం :
• ప్రకాశం జిల్లా ఒంగోలులో ఉన్న ప్రకాశం మిల్క్ ప్రొడ్యూసర్స్ కంపెనీ (PMPCL)ని పునరుద్దరించి డెయిరీ రైతులను ఆదుకునేందుకు రూ.35 కోట్ల ఆర్థిక రుణాన్ని అందించడానికి మంత్రి మండలి ఆమోదం.
• డెయిరీ డెవలప్మెంట్ కోఆపరేటీవ్ ఫెడరేషన్ (APDDCF) ద్వారా ఈ రుణాన్ని సమకూర్చాలని పశు సంవర్ధక శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
• ఈ రుణంతో ముందు ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తారు.
కమ్యూనికేషన్ టవర్ ఇన్ఫ్రా కోసం జాయింట్ వెంచర్ కంపెనీ :
• రాష్ట్రంలో కమ్యూనికేషన్ టవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసేందుకు వీలుగా జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేయడానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
• ఇకపై ప్రభుత్వ స్థలాల్లో మొబైల్ టవర్లు ఏర్పాటు చేసుకోవాలంటే సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ టవర్స్ సంస్థ దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది.
• మరో రెండు కంపెనీలతో కలిసి ఏపీ టవర్స్ లిమిటెడ్ సంస్థ స్ట్రాటజిక్ పార్టనర్‌గా వ్యవహరిస్తుంది. పేస్ పవర్ సిస్టమ్ ప్రై. లిమిటెడ్, లైనేజ్ పవర్ ప్రై.లిమిటెడ్ అనే రెండు సంస్థలతో కలిసి ఏపీ టవర్స్ సంస్థ ఈ జాయింట్ వెంచర్ ఏర్పాటు చేస్తుంది.
• రూ.2 వేల కోట్లతో జాయింట్ వెంచర్ కంపెనీ ఏర్పాటవుతుంది.
కాకినాడ వాణిజ్య రేవు అభివృద్ధి :
• తూర్పుతీరం నుంచి సముద్ర రవాణాలో ప్రస్తుతం ఏపీ నెంబర్ వన్‌గా నిలిచింది. సముద్ర రవాణాలో దేశం మొత్తం మీద మన రాష్ట్రం ముందుండేలా పోర్టులను అభివృద్ధి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది.
• అందులో భాగంగా తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన గ్రామం దగ్గర వాణిజ్య రేవు అభివృద్ధి బాధ్యతలు కాకినాడ సెజ్ లిమిటెడ్‌కు ఇవ్వాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• బిడ్డర్ ఎంపిక, రాయితీ నిర్ణయం నిబంధనల ప్రకారమే.
• కాకినాడ సెజ్ లిమిటెడ్ అందించే కమర్షియల్ ఆపరేషన్స్ నుంచి స్థూల రెవెన్యూలో 2.70% ప్రభుత్వానికి వస్తుంది.
• కాకినాడ సెజ్ లిమిటెడ్ ఇక్కడ మౌలిక సౌకర్యాలను ఏర్పాటు చేస్తుంది.
• రూ. 200 కోట్లతో రహదారులు, నీరు, విద్యుత్ సరఫరా వంటి సదుపాయాలను కల్పిస్తారు.
• విజయనగరం జిల్లా భోగాపురంలో నెలకొల్పనున్న గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్టును ప్రభుత్వ, ప్రైవేట్ పార్టనర్షిప్ పద్ధతిలో అభివృద్ధి చేయాలన్న ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదముద్ర.
భోగాపురం ఎయిర్ పోర్టు భూములకు పరిహారం :
• భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నిర్మాణంలో భాగంగా గూడెపు వలస గ్రామంలో తీసుకున్న 27.87 ఎకరాల భూమికి ఎకరా ఒక్కింటికీ రూ.33 లక్షల చొప్పున పరిహారంగా చెల్లించేందుకు మంత్రిమండలి ఆమోదం.
• ఈ పరిహారం మొత్తం ఆ భూమిలో ఉన్న చెట్లకు అదనం.
విశాఖలో కన్వెన్షన్ సెంటర్ :
• విశాఖపట్నంలో అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుపై గతంలో ఇచ్చిన ప్రభుత్వ ఉత్వర్వులో సవరణలకు మంత్రిమండలి నిర్ణయం.
• విశాఖ తీరంలో 14.15 ఎకరాల విస్తీర్ణంలో లులూ ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్ ప్రై.లిమిటెడ్ ఒక భారీ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుచేస్తోంది.
• లులూ గ్రూపుకు కేటాయించిన స్థలంపై కొన్ని సవరణలు చేయడానికి మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
సీఎఫ్ఎంఎస్ :
• సీఎఫ్ఎంఎస్ వ్యవస్థకు పూర్తిస్థాయి అడ్మిన్ స్ట్రక్చర్ ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి నిర్ణయం.
• దీనికి బోర్డు డైరెక్టర్లు, సీఈవో నియమకానికి, 56మంది సిబ్బందిని నియామకానికి మంత్రిమండలి అనుమతి. వీరిలో 35మందిని డిప్యుటేషన్ పద్ధతిపై తీసుకుంటారు. మరో 17మందిని ఓపెన్ మార్కెట్ నుంచి నియమించుకుంటారు.
• రాష్ట్ర పాలనయంత్రాంగంలో ఆర్థికపరమైన ఇబ్బందులను అధిగమించి మరింత సమర్ధంగా పనిచేసేందుకు సీఎఫ్ఎంఎస్ ఏర్పాటు చేశాం: ముఖ్యమంత్రి.
ఏపీ భవన్ పోస్టులు:
• ఢిల్లీలో వున్న ఏపీ భవన్లో నూతనంగా జాయింట్ కమిషనర్, అసిస్టెంట్ కమిషనరుల పోస్టుల నియామకానికి మంత్రిమండలి ఆమోదం.
ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల ట్యూషన్ ఫీజుల పెంపు:
• ఆంధ్రప్రదేశ్‌లో వున్న ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ట్యూషన్ ఫీజులను పెంపుకు మంత్రిమండలి ఆమోదం.
• పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు ప్యాకేజీ నెంబర్ 2లో ఫీడర్ కెనాల్ నీటి సరఫరా సామర్ధ్యాన్ని 85 క్యూమెక్స్ నుంచి 328 క్యూమెక్స్‌కు పెంచేందుకు అదనంగా ఖర్చుచేసిన రూ.3878.966 లక్షల వ్యయం మంజూరు ప్రతిపాదనకు ఆమోదం.
• IBM నిబంధన ప్రకారం 4.48% టెండర్ డిస్కౌంట్ వర్తింపు.
• శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఎన్టీఆర్ తెలుగుగంగ ప్రాజెక్టులో రూ. 121.23 లక్షలతో నామినేషన్ పద్ధతిపై అత్యవసరమైన 29 పనులకు చీఫ్ ఇంజనీర్ (తిరుపతి) గతంలో ఇచ్చిన పాలనాపరమైన అనుమతులకు మంత్రిమండలి ఆమోదం.
జలవనరుల శాఖకు ప్రాజెక్టుల ఆస్తులు:
• ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కోసం నిధుల సమీకరణకు ఇప్పటికే పూర్తయిన ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టుల ఆస్తులను ఆంధ్రప్రదేశ్ జలవనరుల అభివృద్ధి సంస్థకు బదలాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
డెంటల్ ఇనిస్టిట్యూట్ యాక్ట్, 2007 రద్దు:
• ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు మెడికల్ అండ్ డెంటల్ ఇనిస్టిట్యూషన్స్ యాక్ట్-2007ను రద్దుకు మంత్రిమండలి ఆమోదం.
• ఈ యాక్టు ప్రకారం సెమీ అటానమస్ ఇనిస్టిట్యూట్లుగా వున్న సంస్థలను ఇకపై గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు, గవర్నమెంట్ జనరల్ హాస్పటల్స్‌గా పరిగణిస్తారు. వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల సర్వీసును రెగ్యులర్ చేస్తారు.
కియా ప్లాంటు దగ్గర పోలీస్ స్టేషన్ ఏర్పాటు:
• అనంతపురం జిల్లా పెనుకొండ మండలంలో కియా కార్ల కంపెనీ సైట్ దగ్గర యర్రమంచి గ్రామంలో ఎఫ్ కేటగిరి పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయడానికి మంత్రిమండలి నిర్ణయం.
• ఈ పోలీస్ స్టేషనులో ఎస్ఐ, ఇద్దరు ఎఎస్ఐలు, నలుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 21 మంది కానిస్టేబుళ్లు వుంటారు. ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు రూ.3.17 కోట్ల వ్యయం కానుంది.
వేతన సంఘానికి స్టాఫ్ :
• నూతనంగా ఏర్పాటు చేసిన పదకొండవ వేతన సవరణ సంఘానికి సహాయకారిగా వుండేందుకు 16 పోస్టులు తాత్కాలిక ప్రాతిపదికన అందించేందుకు మంత్రిమండలి నిర్ణయం.
భూముల కేటాయింపు:
• దీపా మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు ప్రభుత్వానికి చెల్లించాల్సిన రూ.4,50,798 (వడ్డీ రూ.3,96,748 + 2018లో లీజు మొత్తం 54,050) రద్దు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• విజయవాడ అర్బన్ మండలం గుణదల గ్రామంలో దీపా మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్టు విజ్ఞప్తి మేరకు ట్రస్టుకు 0.75 సెంట్ల ప్రభుత్వ భూమి కేటాయింపు ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం సంచాం గ్రామంలో కొత్త ఇండస్ట్రియల్ పార్కు 17.18 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏపీఐఐసి విశఆఖ జోనల్ మేనేజర్‌కు షరతులకు లోబడి ఉచితంగా అప్పగించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• విశాఖ జిల్లా గోపాలపట్నం మండలం గోపాలపట్నం గ్రామంలో సర్వే నెం. 114లోని 500 చదరపు అడుగుల ఇండ్ల స్థలాన్ని ఒలింపియన్, అంతర్జాతీయ వెయిట్ లిఫ్టింగ్ కోచ్, కామన్ వెల్త్ క్రీడల్లో బంగారు పతక విజేత ఎం.వి మాణిక్యాలుకు ప్రోత్సాహకంగా, ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం రాచర్ల గ్రామంలో ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కోసం 26.07 ఎకరాల భూమి ఉచితంగా కేటాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• వై.ఎస్. ఆర్ కడప జిల్లా వి.ఎన్.పల్లి మండలం అనిమెల, యు. రాజుపాలెం, అలిందెన, గొనుమాకులపల్లి, పిళ్లావారిపల్లి గ్రామాల పరిధిలోని 118.87 ఎకరాల ప్రభుత్వ భూమిని పవన విద్యుత్ కేంద్ర ప్రాజెక్టుకోసం కేటాయింపు. అపిమల, యు.రాజు పాలెం, గొనుమాకులపల్లి గ్రామాల్లో మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ.2 లక్షలు, అలిదెన గ్రామంలో ఎకరా ఒక్కింటికి మార్కెట్ ధర ప్రకారం రూ.2.50,00, పిళ్లావారిపల్లె గ్రామంలో మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ1.50,000 చెల్లించే ప్రతిపాదనపై అప్పగించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ భూమిని NREDCAP వైస్ చైర్మన్, ఎండీ స్వాధీనపరుస్తారు.
• ప్రకాశం జిల్లా దర్శి మండలం దర్శి గ్రామంలో మినీ స్టేడియం నిర్మాణానికి 6.05 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రీడా ప్రాధికార సంస్థకు ముందస్తుగా అప్పగించేందుకు కలెక్టర్ కు అధికారమిచ్చే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.
• విశాఖ జిల్లా పరవాడ మండలంలో నేషనల్ థర్మల్ ప్రాజెక్టు నిర్మాణానికి సింహాద్రి ఎన్టీపీసీ థర్మల్ పవర్‌కు 883.08 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయింపు. మార్కెట్ ధర ప్రకారం ఎకరా ఒక్కింటికి రూ. 2.25 లక్షలు చెల్లించే షరతు మీద కేటాయించే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం.