ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు , దేవాదాయ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ కు శ్రీశైల దేవస్థానం ఆశీర్వచనం లభించింది. దేవస్థానం ఈ ఓ శ్రీరామచంద్ర మూర్తి , అర్చకస్వాములు , వేదపండితులు శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను కలిసారు . వేద ఆశీర్వచనం అనంతరం ప్రసాదం , శేష వస్త్రం అందించారు.దేవాదాయ శాఖ మంత్రి వి. శ్రీనివాస్ ను కలిసి వేద ఆశీర్వచనం చేశారు.అనంతరం ప్రసాదం , శేష వస్త్రం అందించారు.