అహోబిలేశ్వరుల సేవలో తరిస్తున్న బోయలు

తన చెంతకు రాలేని వారి కోసం తానే స్వయంగా వారి వద్దకు వెళ్లి , యోగ క్షేమం వహామ్యహం అని వారి యోగ క్షేమాలు దగ్గరుండి చూసుకునే దైవం శ్రీ అహోబలేశ్వరులు.
శ్రీ అహోబలేశ్వరులను అందరికి చేరువ చేసే వారు బోయలు.తరతరాలుగా అహోబలేశ్వరులను గరుడ్మంతుని వలె శ్రీ పాద కైంకర్యం చేస్తూ, తమ భుజాల పై మోసే మహద్భాగ్యాన్ని పొందిన వారు ఆలమూరు ,లింగందిన్నె గ్రామాల బోయలు.
ఎండ వేడిని పన్నీటి జల్లులుగా భావించి,రాళ్లు రప్పలతో నిండిన దారులను పూలబాటగా భావించి,అహోబలేశ్వరుల నామమే అమృత పానముగా, రాత్రి పగలు తేడా లేకుండా,అకుంఠిత దీక్షతో గరుడ్మంతుని మరో రూపాలుగా భాసిల్లే అహోబిలేశ్వరుల శ్రీ పాద (బోయలు) కైంకర్యపరుల భక్తి ప్రపత్తులను కీర్తించేందుకు  సరస్వతి   దేవికి కూడా మాటలు చాలవు.

As a part of Paruveta utsavam, Sri Ahobaleshwara after receiving  the prayers of  dasas in thimmanapalle, reached narasapuram.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.