అప్సా ఆధ్వర్యంలో  పోస్టర్ ను అవిష్కరించిన మంత్రి

ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం  లో బ్రిటిష్  హై కమీషనర్,  తెలంగాణ హోం , కార్మిక శాఖా మంత్రి

ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం   హైదరాబాద్ లోని బేగంపెట్ లో ఉన్న  సెస్ (సెంటర్ ఫర్ ఎకానమిక్ అండ్ సోషల్ స్టడీస్)  మంగళ వారం జరిగింది. ఈ కార్యక్రమంలో బ్రిటిష్ డిప్యూటి హై కమీషనర్  ఆండ్ర్యూ ఫ్లెమింగ్, రాష్ట్ర  హోం మరియు కార్మిక శాఖా మంత్రి  నాయిని నర్సింహ రెడ్డి, ప్లాన్ ఇండియా ప్రోగ్రామ్ మేనేజర్ అనిత కుమార్, రాష్ట్ర కో-ఆర్డినేటర్  వర్ష బార్గవి, మహిత  స్వఛ్చంద  ప్రోగ్రాం డైరెక్టర్   పి. రమెష్  శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా  మంత్రి  మాట్లాడుతూ  బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు  కార్మిక శాఖ పోలీస్  శాఖ సమన్వయంతో  దాడులు నిర్వహించి  బాధ్యులపై  కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.

అప్సా ఆధ్వర్యంలో  పోస్టర్ ను అవిష్కరించిన మంత్రి…..

అప్సా ఆధ్వర్యంలో  పోస్టర్ ను అవిష్కరించిన మంత్రి….. అసోసియోషన్ ఫర్ ప్రమోటింగ్ సోషల్ యాక్షన్ (అప్సా) ఆధ్వర్యంలో  చైల్డ్  లేబర్ వ్యతిరేక దినోత్సవం పై  పోస్టర్లను మంత్రి నాయిని నార్సింహరెడ్డి  బంజారాహిల్స్ లోని అధికారిక నివాసంలో  ఆవిష్కరించారు.

 

print

Post Comment

You May Have Missed