అధికారుల సమర్ధతనే శంకించాల్సివస్తోంది-ముఖ్యమంత్రి చంద్రబాబు

డెంగీ నియంత్రణపై ముఖ్యమంత్రి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
పాల్గొన్న జిల్లాల కలెక్టర్లు, వైద్య,ఆరోగ్య శాఖ,మున్సిపల్,పంచాయితీరాజ్ అధికారులు
గ్రామాలు,వార్డులలో సిమెంట్ రోడ్లు,డ్రెయిన్లు నిర్మించాం: ముఖ్యమంత్రి చంద్రబాబు
 పారిశుద్ద్యం మెరుగు పరిచాం,పచ్చదనం పెంచుతున్నాం
అయినా వ్యాధులు ప్రబలడం దురదృష్టకరం. ఇన్నిచేసినా డెంగీ ఇంకా ఉందంటే బాధగా ఉంది.
విశాఖ నగరానికి ఎన్నో అవార్డులు వచ్చాయి.నాలుగేళ్లలో ఎంతో ప్రగతి సాధించాం. అయినా ఇంకా అంటువ్యాధులు ప్రబలడం బాధాకరం.
మరో రెండు రోజుల్లో వ్యాధులను పూర్తిగా అదుపు చేయాలి. పారిశుద్ద్య పరిస్థితుల్లో మార్పు రావాలి. లేకపోతే హెల్త్ ఎమర్జన్సీ ప్రకటిస్తాం.
అసమర్ధంగా వ్యవహరిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటాం.
మూడు జిల్లాలలో వ్యాధులు ప్రబలడం చూస్తే చాలా బాధగా ఉంది. అధికారుల పనితీరుతో తీవ్ర నిరాశ చెందాను
అధికారుల సమర్ధతనే శంకించాల్సివస్తోంది
విశాఖలో 33, గుంటూరులో 20 హాట్ స్పాట్స్ లో పారిశుద్యం మెరుగుపరచాలి.
విశాఖ,అనంతపురం,గుంటూరు,విజయనగరంపై మరింత శ్రద్ధ పెట్టాలి.అన్నిరకాల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి
అధికారుల అసమర్ధత వల్ల ప్రజలు ఇబ్బందులకు గురికాకూడదు
మాకేమిటిలే అనే నిర్లక్ష్యాన్ని సహించను.ఎవరినీ ఉపేక్షించేది లేదు
బాధ్యతారాహిత్యాన్ని సహించేది లేదు.
అన్ని జిల్లాలలో పారిశుద్ధ్యం మెరుగుబడాలి. వ్యాధి నివారణ చర్యలపై ప్రజల్లో అవగాహన పెంచాలి
పట్టణాలలో మెప్మా కార్యకర్తలు చురుకుగా స్పందించాలి
వైద్య ఆరోగ్య శాఖ,మున్సిపల్,పంచాయితీ రాజ్ శాఖలు సమన్వయంగా పనిచేయాలి
ప్రతి హాట్ స్పాట్  బాధ్యత ఒక సీనియర్ అధికారికి అప్పగించాలి
అవసరాన్ని బట్టి మేన్ పవర్ పెంచుకోవాలి
పారిశుద్ద్య సమస్యలతో ఆరోగ్య సమస్యలు తలెత్తే పరిస్థితి ఉండరాదు
దోమల బెడదను పూర్తిగా నివారించాలి.రక్షిత తాగునీటిని అందుబాటులో ఉంచాలి
అన్ని ప్రాంతాలలో ఫాగింగ్ ముమ్మరం చేయాలి. అన్నిచోట్ల యాంటి లార్వా ఆపరేషన్లు చేపట్టాలి
యుద్ద ప్రాతిపదికన ఉపశమన చర్యలు చేపట్టాలి.
మెరుగైన జీవన పరిస్థితుల కల్పన మనందరి బాధ్యత
 ప్రజారోగ్యం పరిరక్షణ కోసమే మనం ఉన్నది
విధి నిర్వహణలో ఎవరు విఫలం అయినా ఉపేక్షించను. బాధ్యతారాహిత్యాన్ని సహించేది లేదు
గ్రామాలు,వార్డులలో పారిశుద్ధ్యం మెరుగుబడాలి
మురుగు నిల్వ ప్రదేశాల్లో ఆయిల్ బామ్స్ వేయాలి
ఆయా ప్రాంతాలలో స్పెషల్ టీములను నియమించాలి.
డ్రోన్ల ద్వారా హాట్ స్పాట్స్ గుర్తించాలి. ఎక్కడెక్కడ మురుగు నిల్వ ఉంటుందో గుర్తించాలి. తక్షణమే ఆయా ప్రాంతాలలో వ్యాధి నివారణ చర్యలు చేపట్టాలి
ఎప్పటికప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాం. అధికారుల పనితీరుపై ప్రజల్లో సంతృప్తి ఉండాలి.
ఎక్కడ పారిశుద్యం అధ్వానంగా ఉన్నా ఫొటోలు తీసి పంపాలి.
print

Post Comment

You May Have Missed