అందరిని కలుపుకొని ముందుకు పోతాను-నిరంజన్ రెడ్డి
సచివాలయంలో తన ఛాంబర్ లో వ్యవసాయ శాఖ మంత్రి గా గురువారం బాధ్యతలు స్వీకరించిన నిరంజన్ రెడ్డి*
నాటి సమైక్య రాష్ట్రంలో వ్యవసాయం కుదేలు అయిపోయి అప్పుల పాలైనరు రైతులు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. అనివార్యంగా రైతులు బోరు బావులపై ఆధారపడి ఉన్న పరిస్థితి.
కరెంట్ బిల్లులు పెంచుతూ పోయారు గత పాలకులు కానీ నాణ్యమైన విద్యుత్ ను అందించలేదు .
కేసీఆర్ 14 సంవత్సరాల పోరాటం తరువాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన విషయం తెలిసిందే.
రైతుల పై దూర దృష్టి తో ప్రాజెక్టులను నిర్మించిన సీఎం కేసీఆర్ రైతులను రాజులుగా చూడడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.
అప్పట్లో గోదావరి నది పై ఒక్క ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టలేదు కానీ ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ వంటి గొప్ప ప్రాజెక్ట్ నిర్మాణం చేపడుతున్నారు.
వ్యవసాయ రంగానికి నీరు, 24 గంటల ఉచిత విద్యుత్ ను అందిస్తున్నాం.
రైతు బంధు దేశంలోనే గొప్ప పథకం, రైతు బంధు తో రైతులు ఆత్మగౌరవం తో బతుకుతున్నారు.
ఉద్యమం నుండి ఇప్పటివరకు కేసీఆర్ అడుగులో అడుగువేస్తూ ముందుకు సాగడం జరిగింది.
నాపై గురుతరమైన బాధ్యతను ఇచ్చినందుకు సీఎం కు కృతజ్ఞతలు.
నాకు వ్యవసాయ శాఖ కేటాయించినందుకు వ్యవసాయ శాఖ, వ్యవసాయ అనుబంధ శాఖలలో ఉన్న అధికారులను అందరిని కలుపుకొని ముందుకు పోతాను.
ఈ సందర్బంగా పలువురు ప్రజా ప్రతినిధులు, సచివాలయ , వ్యవసాయ శాఖ ఉద్యోగులు మంత్రి కి శుభాకాంక్షలు తెలిపారు.
Post Comment