తాడేపల్లి: పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచిన ప్రజలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరు కార్పొరేషన్, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో వైయస్ఆర్ సీపీ విజయం పట్ల పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్ జగన్ ట్వీట్ చేశారు. “దేవుడి దయ, ప్రజలందరి చల్లని దీవెనలు.. ఇవే ఈ రోజు ఇంతటి ఘన విజయాన్ని అందించాయి. గ్రామంతో పాటు నగరం కూడా పనిచేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలిచింది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, నగర పంచాయతీల్లో 100కు 97 మార్కులు వేసిన అవ్వాతాతలు, అక్కాచెల్లెళ్ళు, సోదరులందరికీ ధన్యవాదాలు“ తెలుపుతూ సీఎం ట్వీట్ చేశారు.