×

21న యోగా కార్యక్రమం

21న యోగా కార్యక్రమం

 శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) సోమవారం  శ్రీనటరాజ నృత్య కళాశాల, శ్రీశైలం సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం  సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమం లో సిద్ది వినాయక, ఓం హర హర శంకర, శివుడు తాండం చేయును, అయిగిరినందిని, అఖిలాండేశ్వరి, కైలాసంలో సాంబశివుడు మొదలైన అంశాలకు ఎం. ముక్తశ్రీ, జె. జయంతి, కె. భాగ్యలక్ష్మి జి. పూజిత, జి. నందిని, కె. తనుజ్ఞ తదితరులు నృత్య ప్రదర్శనను అందించారు.

మంగళవారం  సాంస్కృతిక కార్యక్రమాలు: జి. ఆంజనేయులు  బృందం, కర్నూలు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తుంది.

21న యోగా కార్యక్రమం :

జూన్ 21, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేవస్థానం ప్రత్యేకంగా యోగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదికవద్ద ఈ కార్యక్రమం  ఏర్పాటు చేసారు.  ఉదయం గం. 7.00 నుండి గం.8.30 వరకు ఈ ప్రత్యేక కార్యక్రమం  నిర్వహిస్తారు. కార్యక్రమం లో యోగాచార్య బాలసుబ్రహ్మణ్యం, ఒంగోలు  యోగాపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి, యోగా శిక్షణను ఇవ్వనున్నారు.

 స్థానికులు, యాత్రీకులందరూ ఈ కార్యక్రమం లో పాల్గొనవలసినదిగా దేవస్థానం కోరింది.

*Sahasra deepaalankarana seva and Vendi rathothsavam performed in the temple.

print

Post Comment

You May Have Missed