శ్రీశైల దేవస్థానం:చైత్రమాసంలో పౌర్ణమి తరువాత వచ్చే మంగళ లేదా శుక్రవారం రోజున ( ఏ రోజు ముందుగా వస్తే ఆ రోజు) శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారికి కుంభోత్సవం జరపడం సంప్రదాయం. ఈ సంవత్సరం ఏప్రిల్ 30 న ఈ కుంభోత్సవం నిర్వహిస్తారు.అమ్మవారికి సాత్త్వికబలి నిర్వహించేందుకు ( కొబ్బరికాయలు,గుమ్మడికాయలు, నిమ్మకాయలు, మొదలగునవి సమర్పించడం) ఈ కుంభోత్సవం జరిపించడం ఆనవాయితి.
కుంభోత్సవం రోజున స్త్రీ వేషంలో ఉన్న పురుషుడు అమ్మవారికి కుంభహారతి సమర్పించడం ప్రధాన ఘట్టం. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకుని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగిసిన వెంటనే ప్రతి మంగళవారం, శుక్రవారం రోజులలో అమ్మవారికి కొబ్బరికాయలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారమైన ఈ రోజున (19.03.2021) న అమ్మవారికి కొబ్బరికాయలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో ముందుగా అమ్మవారి ఆలయ ప్రదక్షిణ మండపంలో కొబ్బరికాయలను రాశిగా పోసి పసుపు,కుంకుమలతో వాటికి పూజాదికాలు జరిపించి తరువాత అమ్మవారికి ఈ కొబ్బరికాయలు సమర్పించారు.
* B.Rajender Reddy, Jillelaguda, Balapur Mandal, Rangareddy District, Telangana State donated One Lakh For Annadhaanam scheme in srisaila temple on 19th March 2021.
*Ankaalamma Vishesha Puuja , Kumara Swami Puuja, Uyala Seva performed in the temple by Archaka swaamulu.
* Y. Venkata Hanumanth Subrahmanya Shastry, Hyderabad donated Rs.Five Lakhs For Annadhaanam and Five Lakhs For Gosamrakshana Nidhi ( Total 10 lakhs ) .