
* కరోనా మూడో దశను సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం కర్నూలు లోని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో, అన్ని ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఆక్సిజన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు పై ప్రైవేట్ హాస్పిటల్ ఎండిలు, ప్రతినిధులతో వర్క్ షాప్ నిర్వహిస్తున్న జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్ .
పాల్గొన్న జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డాక్టర్ మనజీర్ జీలానీ సామూన్, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ సుమన్, డీఎంహెచ్ఓ రామగిడ్డయ్య, ప్రైవేట్ హాస్పిటల్ ఎండిలు, ప్రతినిధులు, తదితరులు .
* కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్(ఆసరా, సంక్షేమం) యంకెవి శ్రీనివాసులు , స్ధానిక పరిశ్రమల శాఖ కార్యాలయంలో ని సమావేశ మందిరంలో ఈ రోజు ఇండస్ట్రియల్ ఏరియా లోకల్ అథారిటీ(IALA), కుడా ఫీజ్ చార్జెస్(KUDA FEES) గురుంచి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ప్రధానంగా IALA పరిధిలోని వివిధ పరిశ్రమలకు మౌలిక వసతులు కల్పించాలని, కోవిడ్ కారణంగా పరిశ్రమలు నష్టాల్లో ఉన్నాయి, అందుకుగాను రాయితీలు ఇచ్చి ఆదుకోవాలని, కుడా(KUDA) ద్వారా వసూలు చేసే చార్జీలు నీటి కుళాయిల పై పన్ను, ప్రాపర్టీ టాక్స్ పై పన్ను మొదలగు అంశాలను పరిగణలోకి తీసుకుని పన్నులు తగ్గించే విధంగా చూడాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జోనల్ మేనేజర్ ఏపీఐఐసీ, IALA చైర్మన్ , అడిషనల్ కమిషనర్ కె.యం.సి జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ తదితరులు పాల్గొన్నారు.
* ఆదోని రెడ్డి హాస్టల్ ఫంక్షన్ హాల్లో పి ఓ ఎల్ ఆర్( ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్) పై వర్క్ షాప్ నిర్వహించిన జిల్లా జాయింట్ కలెక్టర్ (రెవిన్యూ, రైతు భరోసా) రామ సుందర్ రెడ్డి .
జూమ్ విసి ద్వారా వర్క్ షాప్ లో పాల్గొని రికార్డుల స్వచ్చీ కరణ, సర్వే పై సూచనలు ఇచ్చిన జిల్లా కలెక్టర్ జి వీరపాండియన్.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో రామకృష్ణారెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శ్రీనివాసులు, ల్యాండ్ అండ్ సర్వే ఏ డి హరికృష్ణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు.