Amaravati, July 17: Chief Minister N Chandrababu Naidu directed officials to improve infrastructure in villages. He said steps should be taken for development all village panchayats by improving drainage system, waste management, CC roads LED street lights and setting up of anganwadis.Addressing a review meeting of Panchayat Raj department and state employment guarantee council meeting at secretariat today, the Chif Minister said solid and liquid waste maintenance sheds should be built in three villages in each mandal and a target should be set to complete the task in 9000 villages by December.
The Chief Minister said NREGS funds should be used to link village tanks and greenery should be increased in each village and on the banks of irrigation canals. He said Water conservation theme park should be developed in Amaravati reflecting the water conservation mesures taken up in the state.
The officials informed the Chief Minister said that they completed 53 per cent of works in 2.90 lakh LED street lights to be arranged under Chandranna Kanti scheme in the state. They said 608 village parks, playground in 2865 villages were developed. They said CC roads were laid at a sretch of 1468 m, 278 anganwadi buildings and 15,021 individual toilets were constructed. They said drainage was cleared at a stretch of 7605 km.Minister for Rural Development and Panchayat Raj Nara Lokesh and panchayat raj officials were present.
Brahmin Corporation set up for welfare of brahmins:CM
Amaravati, July 17: Chief Minister N Chandrababu Naidu said Brahmin Corporation was set up for welfare of Brahmins to fulfill the assurance given during his padayatra. Members of Bahmana Sangatana led by it’s general secretary K Sainatha Sarma met Chief Minister at grievance hall this morning. Sainatha Sarma praised the Chief Minister for implementing several welfare programmes for the benefit of Brahmins.Speaking on the occasion Chief Minister N Chandrababu Naidu said that Rs 285 cr was alloted to Brahmin Corporation so far despite of financial crisis. Brahmin Sangatana members from all the 13 districts including Yuva Brahmin Sangam president Gopikrishna met the Chief Minister.
సీఎంకు బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యుల కృతజ్ఞతలు
తమకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నందుకు బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలసి కృతజ్ఞతలు చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ లాంటి పథకాలను తమకు వర్తింపజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యమంత్రిని కలసిన వారిలో బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె. సత్యనారాయణ, సీనియర్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ నరహరిశెట్టి శ్రీహరి, మాజీ ప్రెసిడెంట్ మట్టా జయకర్, న్యాయవాది సింహాద్రి అశోక్ తదితరులున్నారు.
హెచ్ ఆర్ పాలసీ అమలు చేయాలి
తమకు గౌరవవేతనం అందజేయాలని, హెచ్.ఆర్.సి విధానం అమలు చేయాలని విలేజి ఆర్గనైజింగ్ అసిస్టెంట్స్ ( వి.ఓ.ఏ) లు ముఖ్యమంత్రి చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. కుప్పం నియోజకవర్గం రామకుప్పం, శాంతిపురం, గూడుపల్లి, కుప్పం నుంచి పెద్దసంఖ్యలో తరలివచ్చిన వీఓఏలు ముఖ్యమంత్రిని కలసి తమ సమస్యలను విన్నవించారు. తమ పిల్లల పాఠశాల ఫీజు రీఇంబర్మెంట్కు అవకాశమివ్వాలని కోరారు. పేదల జీవితాల్లో వెలుగునింపుతున్న విలేజి ఆర్గనైజింగ్ అసిస్టెంట్ల సమస్యలు అధ్యయనం చేస్తామని, రాష్ట్రవ్యాప్తవిధానానికి రూపకల్పన చేసి లబ్ది చేకూరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబును కలసినవారిలో నేతలు డి.తిమ్మప్ప, ఎం.వాసుదేవ్, పి.గోవిందప్ప, మంగమ్మ, రత్నశీల తదితరులున్నారు.
ఆపన్నులకు ముఖ్యమంత్రి సహాయం
విజయవాడ నుంచి రెండు కాళ్లు లేక అవస్థతో తన దగ్గరకు వచ్చిన జొన్నల పాండురంగారావు పరిస్థితి చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు కదలిపోయారు. ముందుగా రూ.25,000 సహాయం ప్రకటించారు. భవానీపురం రైతు బజారులో తనకు కేటాయించిన దుకాణాన్ని పిడబ్ల్యుడి గ్రౌండ్ రైతుబజారుకు మార్చే విధంగా చూడాలని పాండురంగారావు అభ్యర్ధించగా ముఖ్యమంత్రి తక్షణం పరిష్కరించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఆర్ధికంగా దెబ్బతిన్న చిత్తూరుజిల్లా నారావారిపల్లికి చెందిన కె.గంగయ్యకు రూ.50 వేలు మంజూరు చేశారు. చిత్తూరు జిల్లా గుడిపల్లి మండలం ఒంటిమిట్ట గ్రామం నుంచి వచ్చిన జె. ఉమారాణికి రూ.50,000 ఆర్ధిక సహాయం చేశారు. గుడిపల్లె నుంచి ఎల్ సుమ అనే విద్యార్ధిని ముఖ్యమంత్రిని కలసి తాను కర్నాటక ఆర్కిటెక్చర్ కళాశాలలో బి.ఆర్.టి. లో ప్రవేశానికి అర్హత సంపాదించానని, కానీ మన రాష్ట్రంలోనే చేరాలని ఉందని, సహాయం చేయాలని కోరగా ముఖ్యమంత్రి అవకాశాలు పరిశీలించి సహాయపడాలని అధికారులను ఆదేశించారు.
అన్ని విశ్వవిద్యాలయాలలో ప్రపంచశ్రేణి క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించాలి
అమరావతి, జులై 17 : నాగార్జున యూనివర్శిటీలో ఏర్పాటు చేసినట్టుగా మిగిలిన అన్ని విశ్వవిద్యాలయాలలో కూడా ప్రపంచశ్రేణి క్రీడా మౌలిక సదుపాయాలను కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి విద్యాలయంలో ఆటస్థలాలు విధిగా వుండి తీరాలని మంగళవారం రాత్రి సచివాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో స్పష్టంచేశారు.
నగరాలు, జిల్లా కేంద్రాలు, మండల ప్రధాన కేంద్రాలలో క్రీడా ప్రాంగణాలను ఏర్పాటుచేయాలని, గ్రామీణ ప్రాంతాలలో వున్న పాఠశాలల్లో క్రీడా వసతుల ఏర్పాటుకు అవసరమైతే నరేగా నిధులను ఉపయోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. పట్టణ ప్రాంతాలలో క్రీడా వసతులకు పురపాలక నిధులను కేటాయిస్తామని తెలిపారు. 2018-19 ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాలలో ఐదు వేలకు పైగా ఆట స్థలాలను మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు.
విశాఖపట్నం, తిరుపతి, అమరావతిలను క్రీడా నగరాలుగా తీర్చిదిద్దే కృషిలో వేగం పెంచాలని ముఖ్యమంత్రి సూచించారు. అన్ని జిల్లాలలో క్రీడలకు అవసరమైన అవుడ్డోర్, ఇండోర్ స్టేడియాలు, ఇతర క్రీడా సదుపాయాలను కల్పించాలని చెప్పారు. ప్రతి విద్యార్థి నిత్యం ఏదో క్రీడాంశంలో పాల్గొనేలా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని అన్నారు. రాష్ట్రంలో ఏదో ఒక ప్రాంతంలో నెలనెలా క్రీడా పోటీలను నిర్వహిస్తూనే వుండాలన్నారు. అంతర్జాతీయ క్రీడా పోటీలలో మన విద్యార్థులు పతకాలను గెలుచుకునే స్థాయికి ఎదగాలని చెప్పారు. కానిస్టేబుల్ నియామకాలలో జాతీయస్థాయి పతకాలు సాధించిన వారికి ప్రాధాన్యం కల్పించే అంశంపై త్వరలో ఒక క్రీడా విధానాన్ని రూపొందించాలని చెప్పారు.
అనంతపురము జిల్లా కేంద్రంలో 25 ఎకరాల విస్తీర్ణంలో రూ.25 కోట్ల వ్యయంతో ఇండోర్, అవుడ్డోర్ స్పోర్ట్స్ స్టేడియాన్ని ఏర్పాటు చేస్తున్నామని యువజన, క్రీడా వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రికి వివరించారు. ప్రఖ్యాత అమెరికన్ స్పోర్ట్స్ యూనివర్శిటీ, ఏపీ స్పోర్ట్స్ యూనివర్శిటీ సహకారంతో విశాఖ నగరంలో 250 ఎకరాలలో పీపీపీ పద్ధతిలో స్పోర్ట్స్ సిటీని ఏర్పాటుచేస్తున్నట్టు చెప్పారు. తిరుపతిలో పీపీపీ విధానంలోనే 70 ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్ సిటీని నెలకొల్పుతున్నామన్నారు. ఒంగోలులో స్పోర్ట్స్ స్టేడియం ఏర్పాటుకు కేటాయించిన 40 ఎకరాల స్థలం విషయంలో లీగల్ వివాదాలు తలెత్తినందున మరో స్థలాన్ని గుర్తించే పనిలో వున్నామని తెలిపారు. విజయవాడ విద్యాధరపురంలో 9 ఎకరాలలో స్పోర్ట్ షాపింగ్ కాంప్లెక్స్ సిద్ధం చేస్తున్నామన్నారు. రూ.175 కోట్ల వ్యయంతో పీపీపీ పద్ధతిలో చేపట్టిన బీఆర్ స్టేడియం నిర్మాణ పనులు టెండర్ల దశలో ఉన్నాయని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి, పరిశ్రమల శాఖ సంయుక్తంగా స్పోర్ట్ ఇన్వెస్టర్స్ సదస్సును నిర్వహిస్తున్నాయని, ఏపీని క్రీడాపరికరాల తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఈ సదస్సు వేదిక కాబోతోందని ఎల్వీ సుబ్రహ్మణ్యం తెలిపారు.
ఒలింపిక్ పోటీలలో పతకాలు సాధించడమే లక్ష్యంగా ‘ప్రాజెక్టు గాండీవ’ పేరుతో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టినట్టు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో ప్రతిభావంతులను ఎంపికచేసే ప్రక్రియ జరుగుతోందని చెప్పారు. ఈనెల 20లోగా అథ్లెట్ల ఎంపిక పూర్తవుతుందని, మలిదశలో వీరిని ‘సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్’కు పంపించి అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ అందిస్తామని తెలిపారు. ‘పాంచజన్య’ ప్రాజెక్టు కింద బాస్కెట్ బాల్, ఫుట్ బాల్, హాకీ, సైక్లింగ్, ఖోఖో, కబడ్డీ, హ్యాండ్ బాల్, వాలీబాల్ తదితర క్రీడలలో విద్యార్థులకు శిక్షణ అందిస్తున్నామని చెప్పారు. అన్ని పాఠశాలలో ఫిజికల్ లిటరసీని ప్రోత్సహిస్తున్నామన్నారు.
రాష్ట్రంలో వున్న అన్ని ఎస్సీ, ఎస్టీ గురుకుల పాఠశాలల్లో అత్యాధునిక క్రీడా వసతులను ఏర్పాటు చేస్తున్నామని శాప్ మేనేజింగ్ డైరెక్టర్ బంగార్రాజు చెప్పారు. యువజన, క్రీడల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ముఖ్యమంత్రి కార్యదర్శి ఏవీ రాజమౌళి ఈ సమావేశంలో పాల్గొన్నారు.