యూ.వి. ఎస్ శ్రీ కిరణ్ ,  బృందం కర్నూల్ వారి   గాత్ర కచేరి

శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) బుధవారం యూ.వి. ఎస్ శ్రీ కిరణ్ ,  బృందం కర్నూల్ వారు  గాత్ర కచేరి కార్యక్రమం సమర్పించారు.

ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ గాత్రకచేరి కార్యక్రమం జరిగింది.  ఈ కార్యక్రమంలో  సిద్ధివినాయకం, శంభోశంకరా,

భో…శంభో, నాదతాండవం శంకరం, దేవ దేవం భజే, కాలభైరవాష్టకం, నమోస్తూ వాణి, బ్రహ్మమురారి, నమశ్శివాయ నటేశ్వరాయ తదితర గీతాలను, అష్టకాలను . శ్రీకిరణ్ తదితరులు ఆలపించారు.ఈ కార్యక్రమానికి హర్మోనియం సహాకారాన్ని  నవీన్ కుమార్, తబలా సహాకారాన్ని శివ అందించారు.

 ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు అవుతున్నాయి.

శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.