శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శుక్రవారం డా. విజయ రఘురామరాజు , వారి బృందం, కరీంనగర్ గాత్రకచేరి కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం ఈ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం లో శక్తి సహిత గణపతిం, రత్నగర్భగణపతిం, నమ:శ్శివాయతే, నమోస్తూ వాణి, బ్రహ్మమురారి, నమశ్శివాయ నటేశ్వరాయ.. శ్రీ రాజ రాజేశ్వరి పాహిమాం, శంభో శివ శంభో కాలభైరావాష్టకం తదితర గీతాలను, అష్టకాలను శ్రీ కె.బి. శర్మ, సుకృతి, మేఘమాల, సరళ, డా. అక్షిత, జ్యోతి, రాధాకృష్ణవేణి, వినీల్, కౌముదిరాజు, భువన్, విఘ్నేశ్వర్ తదితరులు ఆలపించారు.ఈ కార్యక్రమానికి తబల సహకారాన్ని ప్రసాద్ అందించారు.