శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) మంగళవారం ప్రవాస భారతీయులు శ్రీమతి విజయలక్ష్మి బృందం, షార్జా (దుబాయ్) గాత్రకచ్చేరి కార్యక్రమం జరిగింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద గాత్రసంగీతం కార్యక్రమం జరిగింది.
గణపతిం భజే, శివపాదం, భ్రమరాంబాష్టకం, అన్నపూర్ణాష్టకం, భో…శంభో, శివపంచాక్షరి, లింగాష్టకం, అయిగిరినందిని తదితర గీతాలను జి. విజయలక్ష్మి, శ్రీలలిత చంద్రశేఖర్, శ్రీలక్ష్మి చావలి, నీలవేణి తదితరులు ఆలపించారు.ఈ కార్యక్రమానికి వయోలిన్ సహకారాన్ని కె. శ్రీరామ్ శ్రీనివాస్, మృదంగం టి.ఎన్. చైతన్య అందించారు.
బుధవారం కార్యక్రమాలు:
శ్రీ ఎస్. రంగయ్య బృందం, మహానంది భజన కార్యక్రమం.