×

శ్రీస్వామి అమ్మవార్ల సేవలో పీఠాధిపతులు

శ్రీస్వామి అమ్మవార్ల సేవలో పీఠాధిపతులు

శ్రీశైల దేవస్థానం: శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్నసిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామివారు ,కాశీ జ్ఞాన సింహాసన నూతన పీఠాధిపతి మల్లికార్జున విశ్వరాధ్య శివాచార్య మహాస్వామి వారు ఆదివారం  శ్రీస్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.వీరి వెంట అంబికానగర్ మఠాధిపతి ఈశ్వర పండితారాధ్య శివచార్యస్వామి, నాగనసూర్ మఠాధిపతి శ్రీకంఠ శివాచార్యస్వామి, మండ్రుత్ మఠాధిపతి రేణుక శివాచార్యస్వామి, మహేంద్రగి మఠపీఠాధిపతి నీలకంఠ శివాచార్యస్వామి, షాపూర్ మఠాధిపతి సుగురేశ్వర శివాచార్యస్వామి, నూల్ మఠాధిపతి శివాచార్యస్వామి తదితరులు ఆలయానికి విచ్చేశారు. , ఆలయం వద్దకు చేరుకున్న వీరికి సంప్రదాయాన్ని అనుసరించి రాజగోపురం వద్ద ధర్మకర్తల మండలి చైర్మెన్ రెడ్డివారి చక్రపాణిరెడ్డి, పలువురు అధికారులు, అర్చకులు, వేదపండితలు పూర్ణకుంభ స్వాగతం పలికారు. తరువాత శ్రీశైల, కాశీ పీఠాధిపతులు, శివాచార్యులు శ్రీ స్వామివారికి అభిషేకాన్ని జరిపించుకుని, అమ్మవారిని దర్శించుకున్నారు. సంప్రదాయాన్ని అనుసరించి వీరికి శేషవస్త్రాలు సమర్పించారు.

print

Post Comment

You May Have Missed