
శ్రీశైల దేవస్థానం: తమిళనాడు రాష్ట్రం చెన్నై నగరం లోని మైలాపూరు శ్రీ కపాలేశ్వరస్వామి దేవస్థానము వారిచే ఇక్కడ శ్రీ స్వామి అమ్మ వార్లలకు సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. వస్త్ర సమర్పణ కార్య క్రమం లో తమిళనాడు రాష్ట్ర మంత్రి పి శేఖర్ బాబు, తమిళనాడు పర్యాటక,సాంస్కృతిక, దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి డా.బి . చంద్రమోహన్ , ఐ.ఎ.ఎస్. దేవదాయశాఖ కమిషనర్ జె.కుమార్ గురువన్ ఐ.ఎ.ఎస్. ఆ రాష్ట్ర దేవదాయశాఖ అదనపు కమిషనర్లు కన్నన్ ఐ.ఎ.ఎస్, శ్రీ తిరుమగళ్,జాయింట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి శ్రీమతి కావేరి ఆ దేవస్థాన అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు.
ఆలయ సంప్రదాయాన్ని అనుసరించి ఆలయ మహాద్వారం కార్యనిర్వహణాధికారి ఎస్ లవన్న, ఆలయ విభాగ అధికారులు, అర్చకులు వారికి స్వాగతం పలికారు.తరువాత తమిళనాడు రాష్ట్ర మంత్రివర్యులు దేవదాయ శాఖ అధికారులు అర్చకులు, వేదపండితులు మంగళవాయిధ్యాలతో ఆలయ ప్రవేశం చేసి శ్రీ స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలను సమర్పించారు.వస్త్ర సమర్పణ తరువాత వారికి వేదాశీర్వచనముతో శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలు అందించారు.
*Pallaki seva performed in the temple.