In view of the heavy rains predicted over next 48 hours, CM has instructed that administrative machinery should be on high alert.
CM has spoken to Chief Secretary Sri Rajiv Sharma, Revenue Spl CS Sri Pradeep Chandra, GHMC Commissioner Sri Janardhan Reddy and Hyderabad Police Commissioner Sri Mahender Reddy and instructed them to be on alert and take all necessary precautions to face any eventuality.
A special state-level control room has been set up to coordinate relief measures. It can be reached at: 040-23454088. District collectors were instructed to set up control rooms.
రాష్ట్రానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో అధికార యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రతో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా అధికారులను అప్రమత్తం చేయాలని, అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. జిహెచ్ఎంసి కమీషనర్ జనార్థన్ రెడ్డి, నగర్ పోలీస్ కమీషనర్ మహేందర్ రెడ్డిలతో కూడా సిఎం ఫోన్లో మాట్లాడారు. జిల్లాల్లో, హైదరాబాద్ లో అవసరమైన చర్యలు తీసుకోవాలని చెప్పారు.
అవసరమైన సహాయక చర్యలు చేపట్టేందుకు పోలీస్ యంత్రాంగాన్ని సిద్ధం చేయాలని చెప్పారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ప్రారంభించాలని, ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుని స్పందించాలని సూచించారు. రాష్ట్ర స్థాయిలో కూడా కంట్రోల్ రూమ్ (040-23454088) ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.
ముఖ్యమంత్రి ఆదేశాలతో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లతో మాట్లాడారు. జిల్లా ఎస్పీలతో కలిసి డిస్ట్రిక్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సమావేశం వెంటనే నిర్వహించాలని ఆదేశించారు. వర్షాల వల్ల ఇబ్బంది కలిగే ప్రాంతాలను ముందుగానే గుర్తించి అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, సదరు కేంద్రాల్లో మంచినీటి సరఫరా, విద్యుత్ సరఫరా, పారిశుధ్య నిర్వహణ బాగుండేలా చూసుకోవాలని చెప్పారు. అంబులెన్సులను, అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకుని అత్యవసర సేవలు అందించాలని వైద్య, ఆరోగ్య శాఖకు సూచించారు. అవసరమైన పక్షంలో నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ సేవలు కూడా అందించడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్లు సంభవించకుండా డిస్కమ్ లు జాగ్రత్త వహించాలన్నారు. రైల్వే లైన్లు, లో లెవల్ కాజ్ వేలు, బ్రిడ్జిల వద్ద ఎప్పటికప్పుడు నీటి ప్రవాహ స్థాయిని అంచనావేస్తూ అవసరమైన రీతిలో స్పందించాలని సూచించారు. చెరువు కట్టల పరిస్థితిని కూడా ఎప్పటికప్పుడు గమనించాలని నీటి పారుదలశాఖను, గ్రామ స్థాయిలో ఉండే విఆర్ఎలు, విఎవోలను ఆదేశించారు.