కర్నూలు, జులై 29 :కర్నూలు జిల్లాలో జగనన్న విద్యా దీవెన సంబంధించి ఈ ఏడాది రెండవ విడత కింద 90,524 మంది విద్యార్థులకు గాను అర్హులైన 80,507 మంది తల్లుల ఖాతాలలో 50.53 కోట్ల రూపాయలు జమ చేసామని జిల్లా ఇంచార్జి కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్ పేర్కొన్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి గురువారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి జగనన్న విద్యా దీవెన పథకం సంబంధించి ఈ ఏడాది అర్హులైన విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించారు.
స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన పథకం ఈ ఏడాది రెండో విడత ఆర్థిక లబ్దిని విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమ చేసే కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనువాసులు, సోషల్ వెల్ఫేర్ డిడి రమాదేవి, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ వెంకట లక్ష్మి, మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ మహబూబ్ బాషా, డిఎస్ డబ్ల్యుఓ చింతామణి, విద్యార్థుల తల్లులు పాల్గొన్నారు.
అనంతరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ లో జిల్లాలో జగనన్న విద్యా దీవెన కింద ఈ ఏడాది రెండవ విడత కింద 90,524 మంది విద్యార్థులకు గాను అర్హులైన 80,507 మంది తల్లుల ఖాతాలలో 50.53 కోట్ల రూపాయల మెగా చెక్కును జిల్లా ఇంచార్జి కలెక్టర్ డా.మనజీర్ జిలానీ సామూన్, జాయింట్ కలెక్టర్ (ఆసరా మరియు సంక్షేమం) శ్రీనువాసులు విద్యార్థుల తల్లులకు అందజేశారు.