శ్రీశైల దేవస్థానం:కొలనుభారతి క్షేత్రంలో వసంత పంచమి మహోత్సవ కార్యక్రమంలో శ్రీ స్వామిఅమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించిన *నందికొట్కూరు శాసనసభ సభ్యులు గిత్త జయసూర్య , శ్రీశైల దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, య , తెదేపా నంద్యాల పార్లమెంట్ ఇంచార్జ్ మాండ్ర శివానంద రెడ్డి దంపతులు , ధర్మకర్తల మండలి సభ్యులు గుండ్ల గంగమ్మ, చలివేరు కాశీనాథ్, చిట్టిబొట్ల భరద్వాజ శర్మ , రేఖ గౌడ్ , EE నరసింహరెడ్డి, వసంత పంచమి కార్యక్రమ ప్రత్యేక అధికారి ఫణీంద్ర ప్రసాద్, AEO హరిదాసు, AEO సతీష్ మాలిక్ , సహాయ ప్రజాసంబంధాల అధికారి డా. శివారెడ్డి , దివాకర్ రెడ్డి, కార్తీక్ , భక్తులు పాల్గొన్నారు
*
* ఎం. శివ నాగిరెడ్డి, తాడిపత్రి ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,00,116/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాదుకు అందించారు. దాతకు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు.
*బంగారు తాళి బొట్లు సమర్పణ
ఈ రోజు చెన్నుపాటి తిరుపతిరావు, ఉయ్యూరు, కృష్ణా జిల్లా 78 గ్రాములతో తయారు చేయించిన బంగారు తాళిబొట్లను దేవస్థానమునకు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ బంగారు తాళిబొట్లను పర్యవేక్షకులు జి. రవికుమార్, సంబంధిత సిబ్బందికి అందించారు.
అనంతరం వీరికి తగు రశీదును అందజేసి వేదాశీర్వచనముతో శ్రీస్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలను, ప్రసాదాలు అందించారు.
*ఊయలసేవ
లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయలసేవను నిర్వహించింది.
ప్రతి శుక్రవారం రోజు , పౌర్ణమి, మూలానక్షత్రం రోజులలో ఈ ఊయలసేవ నిర్వహిస్తారు.
*
సాంస్కృతిక కార్యక్రమాలు
దేవస్థానము నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) ఈరోజు శ్రీవల్లి మ్యూజిక్ అకాడమీ, హైదరాబాద్ వారిచే భక్తీ సంగీత విభావరి కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో శ్రీ విఘ్న రాజం భజే, సాంబ శివా, కైలాస శిఖరాన, శివ పంచాక్షరి స్తోత్రం, శివాష్టకం, శివుని శిరస్సు పైన తదితర అష్టకాలను, గీతాలను శివాని, ప్రత్యూషశ్రీ, మాధురి, ఎస్.ఎస్. సహస్ర, శ్రీమాన్ ఆలపించారు.
*. మనోజ్, అనంతపుర ఈ రోజు అన్నప్రసాద వితరణ పథకానికి విరాళం రూ. 1,00,016/-లను అందజేశారు. ఈ మొత్తాన్ని పర్యవేక్షకులు కె. శివప్రసాద్కు అందించారు. దాతకు తగు రశీదు, ప్రసాదాలు, శేషవస్త్రం అందించారు