శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థాన దత్తత దేవాలయమైన కొలనుభారతి క్షేత్రంలోని సరస్వతి ఆలయంలో ఈ నెల 23వ తేదీన వసంత పంచమి మహోత్సవం అత్యంత వైభవంగా జరుగనుంది.
ఈ నెల 10వ తేదీన నందికొట్కూరు శాసనసభ్యులు గిత్తా జయసూర్య ఆధ్వర్యములో కొలనుభారతిలో సమన్వయ సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ఆర్.డి.ఓ. నాగజ్యోతి, జిల్లా దేవదాయశాఖ అధికారి మోహన్, తహశీల్దార్ ఉమారాణి, గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ యాదవ్, విద్యుత్ శాఖ ఏడి రామసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.ఈ సమావేశంలో తీసుకున్న అన్ని నిర్ణయాల మేరకు కొలనుభారతిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇందులో భాగంగా ఆదివారం పలువరు దేవస్థానం అధికారులు. పలువురు వైదిక సిబ్బంది ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ పరిశీలనలో అమ్మవారి ఆలయ ప్రధానార్చకులు వై. విజయకుమారస్వామి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ఎం. నరసింహారెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారి , వసంత పంచమి మహోత్సవ ప్రత్యేక అధికారి యం. ఫణిధర ప్రసాద్, డిప్యూటీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరు ( ఐ /సి) సుబ్బారెడ్డి, అమ్మవారి అర్చకులు పవన్కుమార్శర్మ, సహాయ ఇంజనీర్లు, సహాయ స్థపతి, ఉద్యాననవ అధికారి లోకేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వసంతపంచమి రోజున సరస్వతీ అమ్మవారికి జరిపించాల్సిన ఆయా పూజాదికాలు, నివేదనలు, సామూహిక అక్షరభ్యాసాలు గురించి మొదలైనవాటి వైదిక సిబ్బంది చర్చించారు.
తరువాత భక్తులకు దర్శనం క్యూలైన్ల ఏర్పాటు, సామూహిక అక్షర అభ్యాస నిర్వహణ ఏర్పాట్లు, ఉత్సవం రోజున పుష్పాలంకరణ, మంచినీటి సదుపాయం, అన్నప్రసాద వితరణ, వాహనాల పార్కింగు ఏర్పాట్లు, సూచికబోర్డుల ఏర్పాటు, శౌచాలయాల ఏర్పాటు మొదలైన ఏర్పాట్ల గురించి అధికారులు పరిశీలించారు.
కాగా కొలనుభారతీదేవి ఆలయం రాష్ట్రంలోని ఏకైక సరస్వతీదేవి ఆలయంగా ప్రసిద్ధమైంది.
