
శ్రీశైల దేవస్థానం:భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఈ నెల 20వ తేదీ, సెప్టెంబరు 3వ తేదీన వరలక్ష్మీవ్రతాన్ని ఆర్జిత పరోక్షసేవగా నిర్వహిస్తోంది.
అక్కమహాదేవి అలంకార మండపం ప్రక్కన నాగులకట్ట వద్ద ఆ రోజున ఉదయం 10.00 గంటల నుండి ఈ వ్రతం నిర్వహిస్తారు .
భక్తులు ఆన్లైన్ ద్వారా సేవారుసుము చెల్లించి పరోక్షంగా ఈ వరలక్ష్మీవ్రతాన్ని జరిపించుకోవచ్చు.
కాగా ఈ పరోక్షసేవకు భక్తులు రూ.1,116-00లు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ సేవారుసుమును దేవస్థానం వెబ్ సైట్ – www.srisailadevasthanam.org లేదా www.tms.ap.gov.in ద్వారా చెల్లింపు చేయవచ్చు
ఈ పరోక్షసేవ ప్రత్యక్ష ప్రసారాలను వీక్షించేందుకు వీలుగా ప్రసార వివరాలు, ప్రసారాల సమయం మొదలైనవాటిని ఎప్పటికప్పుడు సేవాకర్తలకు తెలుపుతారు.
సేవాకర్తలేకాకుండా భక్తులందరు కూడా వీటిని శ్రీశైలటి.వి/ యూ ట్యూబ్ ద్వారా వీక్షించవచ్చును.
భక్తులందరు కూడా ఈ పరోక్షసేవను సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం కోరింది.
ఇతర వివరాలకు దేవస్థానం సమాచార కేంద్ర ఫోన్ నంబర్లు 83339 01351/ 52/53/ 54/55/56 లను సంప్రదించవచ్చును.