
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శుక్రవారం వ నపర్తి నరసింహారావు, పోరుమామిళ్ళ బృందం ‘రావణ వధ’ పై తోలుబొమ్మలాట కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం గం.6:00 ని||ల నుండి ఈ తోలుబొమ్మలాట కార్యక్రమం జరిగింది. కథకులుగా వనపర్తి నరసింహారావు వ్యవహరించగా, గాత్రం కొండమ్మ, నాగేంద్రం, బుజ్జమ్మ, ఎంకోజి తదితరులు అందించారు.
రెండో కార్యక్రమం శివశక్తి బృందం, నంద్యాల వారు భక్తి సంగీత విభావరి కార్యక్రమం సమర్పించారు.
శివ శివయనరాదా, శివపంచాక్షరి, శివ శివ భవ భవ, శ్రీ రాజరాజేశ్వరి తదితర గీతాలను శ్రీమతి జె. మాధురి, హరిచరణ్ గానం చేసారు. మృదంగ సహకారాన్ని వీరస్వామి, వయోలిన్ సహకారాన్ని కొండపల్లి శ్రీనివాస్ అందించారు.
శనివారం నిత్య కళారాధన:
శనివారం శ్రీమతి డి. కిరణ్మయి , హైదరాబాద్ బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తుంది.
* Uyala Seva , Offering of coconuts programmes performed in the temple.