×

శ్రీస్వామి అమ్మవార్లకు  ఊయలసేవ

శ్రీస్వామి అమ్మవార్లకు  ఊయలసేవ

 శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం శుక్రవారం  సాయంత్రం శ్రీస్వామిఅమ్మవార్లకు  ఊయలసేవను నిర్వహించింది.

ప్రతి శుక్రవారం,  పౌర్ణమి, మూలా నక్షత్రం రోజులలో  ఊయలసేవ నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేసారు.

అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా షోడశోపచార పూజ జరిపారు. తరువాత చివరగా ఊయలసేవ జరిపారు.

ఊయలసేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు

చేసారు.

పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు.

print

Post Comment

You May Have Missed