×

ఊయల సేవలో శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ

ఊయల సేవలో శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ

 శ్రీశైల దేవస్థానం:లోకకల్యాణం కోసం దేవస్థానం ఈ రోజు (31.12.2021) సాయంకాలం శ్రీస్వామిఅమ్మవార్లకు ఊయల సేవను నిర్వహించింది.

ప్రతి శుక్రవారం రోజు , పౌర్ణమి, మూలనక్షత్రం రోజులలో ఈ ఊయల సేవ నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ అర్చకస్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తరువాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ జరిపారు.

అనంతరం ఊయలలో వేంచేబు చేయించిన శ్రీస్వామిఅమ్మవార్లకు  షోడశోపచార పూజ చేసారు.

ఆ తరువాత విశేషంగా అమ్మవారికి అష్టోత్తరం, త్రిశతి, ఖడ్గమాల, సహస్రనామపూజలు, స్వామివారికి సహస్రనామార్చన జరిగాయి. చివరగా ఊయలసేవ జరిపారు.

ఊయల సేవను పురస్కరించుకుని శ్రీస్వామిఅమ్మవార్లకు విశేషంగా పుష్పాలంకరణ, పుష్పార్చనలు జరిగాయి.

పుష్పాలంకరణకు గాను పలుపుష్పాలు వినియోగించారు.

print

Post Comment

You May Have Missed