Unveiling of Dr.B.R. Ambedkar Statue at Necklace Road, Hyderabad

Hyderabad,April14,2023: Unveiling of Dr.B.R. Ambedkar Statue at Necklace Road, Hyderabad.

*అది విగ్రహం కాదు, నిత్య చైతన్య దీప్తి- సి.ఎస్ శాంతి కుమారి

     హైదరాబాద్, ఏప్రిల్ 14 :: రాష్ట్ర ముఖ్యమంత్రి శుక్రవారం   ఆవిష్కరించిన డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహం కేవలం విగ్రహం మాత్రమే కాదని, హైదరాబాద్ నగరానికి విచ్చేసే ప్రతి పౌరుడికి, ప్రతి పర్యాటకుడికి ఈ అత్యద్భుత విగ్రహం ఒక నిత్య చైతన్య దీప్తిగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అన్నారు.  అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమం సందర్బంగా  నిర్వహించిన కార్యక్రమంలో సి.ఎస్  స్వాగతోపన్యాసం చేశారు. ఈ విగ్రహం నగరంలో, రాష్ట్రంలో నివసించే, పర్యటనకు వచ్చే ప్రజలకు, ప్రభుత్వాధికారులకు, ఉద్యోగులకు, కార్మికులకు, కర్షకులకు, బడుగు, బలహీనవర్గాలకు,  అందరికీ నిరంతర స్పూర్తిగా ఉంటుందని అన్నారు.

“ఈ చారిత్రాత్మక ఘట్టంలో సందర్భంలో తానూ కూడా భాగస్వామిని అయినందుకు ఒక అధికారిగానే కాక, వ్యక్తిగా కూడా చాలా సంతోషిస్తున్నాను” అని సి.ఎస్ పేర్కొన్నారు.

2014 లో యంగ్ స్ట్ స్టేట్ ఆఫ్ ఇండియా – ‘తెలంగాణ’ ఏర్పాడిన తర్వాత ఈ 9 సంవత్సరాలలో జరిగిన అద్భుత కృషి, ప్రగతి వలన తెలంగాణ జి.ఎస్.డి.పి  దాదాపు మూడు రెట్లు పెరిగి, రూ.13.27 లక్షల కోట్లకి చేరిందని, అదే విధంగా తలసరి ఆదాయం 3,17,115 రూపాయిలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని గుర్తుచేశారు.

తెలంగాణ ప్రభుత్వం, అభివృద్ధి పథకాలు అందరికి అందాలనే సంకల్పంతో, అట్టడుగు, దళిత, బలహీన, బడుగు, పీడిత, తాడిత ప్రజలు, మహిళల సర్వతోముఖ వికాసం కోసం దేశంలో ఎక్కడా లేని వినూత్నమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని, ఇటు వంటి పథకాలలో, మాణిక్య మకుటం లాంటిది ‘దళిత బంధు’ పథకం అని తెలిపారు.

ఈ మహోన్నత లక్ష్యాన్ని సాధించడానికి ప్రధాన కారకులు, ప్రేరకులు అయిన రాష్ట్ర ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. విగ్రహం ఏర్పాటుకు స్ధలాన్ని ఎంపిక చెయ్యడం నుండి, ప్రతీ దశలోనూ తమ అమూల్య సూచనలనిస్తూ, ఈ అనితర సాధ్యాన్ని, అతితక్కువ కాలంలో సుసాధ్యం చేసిన మన  ముఖ్యమంత్రి  దార్శనికత ఒక అద్భుతమని సి.ఎస్ శాంతి కుమారి తెలిపారు. ఈ కార్యక్రమానికి ఎస్.సి. డెవలప్మెంట్ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా వందన సమర్పణ చేశారు.

*తన ఆహ్వానం మేరకు ప్రగతి భవన్ కు చేరుకున్న ప్రకాశ్ అంబేద్కర్  కు   ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సాదరంగా ఆహ్వానం  పలికారు. శాలువాతో ఘనంగా సత్కరించి పూలగుచ్చమందించారు. అనంతరం  మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. అనంతరం మధ్యాహ్నం భోజనం తో అతిథ్యమిచ్చారు.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.