×

కన్నుల విందు చేసిన కైలాస వాహనసేవ, మహాదుర్గ అలంకారం

కన్నుల విందు చేసిన కైలాస వాహనసేవ, మహాదుర్గ అలంకారం

  • కన్నుల విందు చేసిన కైలాస వాహనసేవ, మహాదుర్గ అలంకారం; మార్చ్ 20 ,2023

*ఉగాది పండుగ సందర్భంగా భద్రత ఏర్పాట్లు పరిశీలించిన జిల్లా ఎస్పీ  కె.రఘువీర్ రెడ్డి

ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలం వచ్చే భక్తుల క్షేమం  లక్ష్యంగా  బందోబస్తు చర్యలు చేపట్టామని,   ముఖ ద్వారం వద్ద నుండి దైవ దర్శనం చేసుకునే వరకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టామని నంద్యాల జిల్లా ఎస్పీ  కె. రఘువీర్ రెడ్డి  తెలియజేశారు.భద్రతా చర్యల్లో భాగంగా శ్రీశైల శిఖరం, ముఖ ద్వారం, సాక్షి గణపతి ,నందసర్కిల్ మొదలగు ప్రాంతాల్లో పర్యటించి ఆ ప్రాంతాలలో ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, వాహనదారులకు ఇబ్బంది కలగకుండా సాఫీగా వెళ్లడానికి తీసుకోవలసిన చర్యల గురించి సంబంధిత అధికారులను ఆదేశించారు.అనంతరం టోల్ గేట్,నంది సర్కిల్, మల్లికార్జున సత్రం, నంది మండపం, పాతలగంగ మొదలగు ప్రాంతాల్లో పర్యటించి భద్రత ఏర్పాట్లు పరిశీలించి భద్రత చర్యలలో తీసుకోవలసిన చర్యలపై సంభందిత అధికారులకు సూచనలు సలహాలు ఇచ్చారు.వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగకుండా రోడ్ల పై ఉన్న వాహనాలను తొలగించాలని వాహనాలకు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో మాత్రమే పార్కింగ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ట్రాఫిక్ సెక్టార్ అధికారులను ఆదేశించారు.ట్రాఫిక్ అంతరాయం కలుగకుండా చూసుకునేందుకు ఏర్పాటు చేసిన బ్లూ కోట్స్ సిబ్బంది 24 X 7 ఉగాది బందోబస్తు ముగుసేవరకు శ్రీశైలంలో మీకు కేటాయించిన పరిసరాల్లో పర్యటించి ట్రాఫిక్ అంతరాయం లేకుండా చూడాలని ఆదేశించారు.ఉగాది పండుగ సందర్భంగా శ్రీశైలంలో బందోబస్తు నిమిత్తం దాపుగా 1000 మంది సిబ్బందిని నియమించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు శ్రీశైలం ఎస్ ఐ లక్మణరావు పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed