
శ్రీశైల దేవస్థానం:తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల దేవస్థానానికి కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలని కోరుతూ దేవాదాయశాఖకు ప్రతిపాదన పంపాలని ధర్మకర్తల మండలి సమావేశం తీర్మానం చేసింది. దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి అధ్యక్షతన గురువారం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది.ఈ సమావేశంలో మొత్తం 50 అంశాలు చర్చించారు. వీటిలో 49 అంశాలు ఆమోదించారు. ఒక అంశం వాయిదా పడింది.
సమావేశంలో ముందుగా ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డివారు మాట్లాడుతూ ఇటీవల దేవస్థానం వేదపండితులు జగన్నాథశర్మ ఆకస్మికంగా మరణించడం ఎంతో బాధాకరమన్నారు. సమావేశ ప్రారంభంలో జగన్నాథశర్మ ఆత్మశాంతికి మౌనాన్ని పాటించారు.
అధ్యక్షులు మాట్లాడుతూ మహాకుంభాభిషేకాన్ని విజయవంతంగా నిర్వహించిన కార్యనిర్వహణాధికారికి, దేవస్థానం సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేశారు. అందరి సమిష్టికృషితో మహాకుంభాభిషేకం అత్యంత వైభవంగా జరిగిందన్నారు.
ధర్మకర్తల మండలి సమావేశపు ముఖ్య నిర్ణయాలు :
- శ్రీశైలంలో స్థానికులు , యాత్రికుల సౌకర్యార్థం 30 పడకల వైద్యశాల నిర్మాణానికి ఆమోదం, అంచనా వ్యయం రూ. 19 కోట్లు.
దేవస్థాన గో సంరక్షణశాలలో ( గౌరీ గణేశ గోశాల) రక్షణ కంచె ఏర్పాటు, అవసరమైనచోట్ల గాల్వనైజుడు షీటుతో షెడ్డు ఏర్పాటు, సిమెంట్ కాంక్రీట్ రోడ్డు వేయడం, విభూతి తయారీ షెడ్డుకు మరమ్మతులు మొదలైన అభివృద్ధి పనులు,
అంచనా వ్యయం రూ. 36 లక్షలు.
కర్నూలు నగరంలోని దేవస్థానం సమాచార కేంద్రం వద్ద కల్యాణమండపం నిర్మాణానికి ఆమోదం, అంచనా వ్యయం రూ. 4.99 కోట్లు.
కర్నూలులోని సమాచార కేంద్రం వద్ద వాణిజ్య సముదాయం ఏర్పాటుకు ఆమోదం,
అంచనా వ్యయం రూ. 3.70 కోట్లు.
- సున్నిపెంటలో నిర్మిస్తున్న సిబ్బంది వసతిగృహాలకు నీటిసరఫరా ఏర్పాట్లు,
- అంచనా వ్యయం రూ. 15 కోట్లు.
మల్లికార్జునసదన్ అతిథిగృహంలో తగు మరమ్మతులు , అభివృద్ధి పనులు,
అంచనా వ్యయం రూ. 9.50 లక్షలు.
భక్తుల సౌకర్యార్థం కుమార సదన్ వసతి సముదాయంలో అభివృద్ధి పనులు చేపట్టేందుకు తీర్మానించారు,
అంచనా వ్యయం : 10.60 లక్షలు.
*దేవస్థానం అవసరాల మేరకు ఆయా సందర్భాలలో ,రాబోవు వేసవికాలం, శ్రావణమాసం, రాబోవు గణపతి నవరాత్రులు, దసరా మహోత్సవాలు, కార్తికమాసం మొదలైన సందర్భాలలో పైప్ పెండాల్స్, షామియానాలు, గ్రీన్ మ్యాట్ మొదలైనవి ఏర్పాటుకు ఆమోదం,అంచనా వ్యయం రూ.39.90 లక్షలు
భద్రతా చర్యలలో భాగంగా పాతపుష్కరిణి వద్ద రక్షణ కటంజనాలు, పుష్కరిణి పరిసర ప్రాంతంలో సుందరీకరణ పనులకు ఆమోదం,అంచనా వ్యయం రూ. 15.5 లక్షలు.
- భద్రతాచర్యలలో భాగంగా హాటకేశ్వరాలయం వద్ద రక్షణ కటంజనాలు ఏర్పాటుకు ఆమోదం,
- అంచనా వ్యయం రూ. 16.75 లక్షలు.
ఫిల్టర్ బెడ్ వద్ద భక్తుల సౌకర్యార్థం ప్రజా శౌచాలయాలు (పబ్లిక్ టాయిలెట్ల ఏర్పాటు) ఏర్పాటుకు
ఆమోదం,అంచనా వ్యయం : రూ. 17 లక్షలు.
పారిశుద్ధ్య చర్యలలో భాగంగా క్షేత్రపరిధిలో పలుచోట్ల చెత్తకుండీల ఏర్పాటుకు ఆమోదం,
అంచనా వ్యయం రూ. 15 లక్షలు.
సిద్ధరామేశ్వర పాదాలు పరిసర ప్రాంతాలలో జల్లు స్నానానికి ప్లాట్ ఫారం నిర్మాణం మొదలైన
పనులకు ఆమోదం,అంచనా వ్యయం, రూ. 6.5లక్షలు,
తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో శ్రీశైల దేవస్థానానికి కూడా స్వయం ప్రతిపత్తి కల్పించాలని దేవాదాయశాఖకు ప్రతిపాదన పంపాలని తీర్మానించారు.
క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనుల దృష్ట్యా సూపరింటెండింగ్ ఇంజనీరు పోస్టు ఏర్పాటుకు దేవాదాయశాఖకు ప్రతిపాదనలు పంపాలని తీర్మానించారు.
దేవస్థానంలో క్వాలిటీ కంట్రోల్ విభాగాన్ని ఏర్పాటు చేయాలని తీర్మానించారు.
ఈ సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులుమఠం విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి జంగం సుజాతమ్మ, జి.నరసింహారెడ్డి, శ్రీమతి ఎం. విజయలక్ష్మీ అలకుంటగారి మురళి, మేరాజోత్ హనుమంతునాయక్, ఓ. మధుసూదన్ రెడ్డి, శ్రీమతి సూరిశెట్టి మాధవీలత, ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, రామ్ మోహన్ నాయుడు పాల్గొన్నారు.
అదేవిధంగా ఉప కార్యనిర్వహణాధికారిణి రవణమ్మ. అన్ని విభాగాల అధికారులు, పర్యవేక్షకులు
పాల్గొన్నారు.