
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో మొత్తం 20 అంశాలు చర్చించి ఆమోదించారు. సమావేశం బుధవారం జరిగింది.ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో ధర్మకర్తల మండలి సభ్యులు ఎం. విరూపాక్షయ్యస్వామి, శ్రీమతి జంగం సుజాతమ్మ, జి. నరసింహారెడ్డి, శ్రీమతి ఎం. విజయలక్ష్మీ శ్రీమతి బి. రామేశ్వరి, శ్రీమతి ఎ. లక్ష్మీసావిత్రమ్మ, అలకుంతగిరి మురళి, మేరాజోత్ హనుమంతునాయక్, ఓ. మధుసూదన్‌రెడ్డి, శ్రీమతి సూరిశెట్టి మాధవీలత పాల్గొన్నారు. ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు, కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి, ఎక్స్ అఫ్ఫీసియో సభ్యులు , శ్రీ స్వామి వారి ఆలయ ప్రధానార్చకులు హెచ్. వీరయ్యస్వామి కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మొత్తం 20 అంశాలు చర్చించి ఆమోదించారు.
ముఖ్య తీర్మానాలు:
- శృంగేరీ శంకరమఠం నుంచి కరివేన సత్రం వరకు ఆర్ సిసి డ్రైన్ నిర్మాణానికి ఇ – ప్రొక్యూర్మెంట్ టెండరు పిలవటానికి తీర్మానం. ఈ డ్రైన్ నిర్మాణపు అంచనా వ్యయం రూ. 39,95,000/- లు
- ఆలయప్రాంగణములోని నవ బ్రహ్మ ఆలయాలు, కుమారస్వామి ఆలయం మొదలైన పరివార ఆలయాలకు ఇత్తడితో తయారు చేసిన గ్రిల్ వాకిళ్ళను ఏర్పాటుకు ఆమోదం. దీని అంచాన వ్యయం రూ. 17,50,000/-లు
- దేవస్థానం వైద్యశాలలో ఎక్స్‌రే గదిని నిర్మించటానికి ఆమోదం . దీని అంచనా వ్యయం రూ. 7,80,000/-లు
- నూతనంగా నిర్మించిన గణేశ్ సదనం లో ప్లాస్టిక్ బకెట్లు, మగ్గులు, చిన్న బకెట్లు, బాత్రూమ్ స్టూల్స్ మొదలైన వస్తువులు కొనుగోలు కు పిలిచిన టెండరు రేట్లను ఆమోదం.
- కైలాస కంకణాలు తయారీ నిమిత్తం దేవస్థానానికి అవసరమైన ఉలన్దారపు ఉండలు ( నీలం , చందనం రంగు) కొనుగోలుకు సంబంధించి టెండరు రేట్లను ఆమోదించారు.
–దేవస్థానం గో సంరక్షణశాలకు ఒక సంవత్సర కాలంపాటు , ఏప్రియల్ -2023 నుంచి మార్చి 2024 వరకు గోవులకు అవసరమైన ఎండువరిగడ్డిని కొనుగోలుకు సంబంధించి టెండరు రేట్లను ఆమోదించారు.
- దేవస్థానం గో సంరక్షణశాలకు రెండు సంవత్సరాల కాలంపాటు,ఏప్రియల్ -2023 నుంచి మార్చి – 2025 వరకు గోవులకు అవసరమైన పచ్చిగడ్డిని కొనుగోలుకు సంబంధించి టెండరు రేట్లను ఆమోదించారు.
- పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ నిషేధించడంలో భాగంగా ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ళ స్థానంలో గాజు సీసాల బాటిళ్ళను వినియోగించుటకు తీర్మానం .
- సమావేశ ప్రారంభంలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమితులైనస్వామివార్ల ప్రధానార్చకులు హెచ్ వీరయ్యస్వామి వారిచే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.కార్యనిర్వహణాధికారి వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు.ప్రమాణ స్వీకారం అంతరం అధ్యక్షులు, సభ్యులు వీరయ్యస్వామికి అభినందనలు తెలియజేశారు.