

శ్రీశైల దేవస్థానం: కార్తిక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు ఆదేశించారు. శుక్రవారం ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు, ఎ.వి.రమణ, శ్రీమతి బి. రవణమ్మ, శ్రీమతి జి. లక్ష్మీశ్వరి, శ్రీమతి కె.కాంతివర్ధిని, శ్రీశంకరశెట్టిపిచ్చయ్య, జె.రేఖాగౌడ్, ఎ.అనిల్‌కుమార్, డి. వెంకటేశ్వర్లు, బి. వెంకటసుబ్బారావు, సిహెచ్ కాశీనాథ్, యం.మురళీధర్, శ్రీమతి సుబ్బలక్ష్మి, పి.యు. శివమ్మ, శ్రీమతి జి. శ్రీదేవి , ప్రత్యేక ఆహ్వానితులు కె.నాగమల్లేశ్వరరావు, వి. కోటారెడ్డి, బి.చంద్రమౌళీశ్వరరెడ్డి, కె. సుధాకరరెడ్డి, వి. వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి యం. శ్రీనివాసరావు మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి క్షేత్ర పర్యటన, అన్నప్రసాద వితరణ, ఆలయ ఆదాయ వ్యయాలను వివరించారు. దేవస్థానం భక్తులకు ఏర్పాటు చేస్తున్న దర్శన,వసతి సదుపాయాలు, మాస్టర్ ప్లాన్ అభివృద్ధి పనులు తదితర అంశాలను వివరించారు.
అనంతరం ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు మాట్లాడుతూ కార్తిక మాసంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేయాలన్నారు. భక్తులు పాతాళగంగలో పుణ్యస్నానాలు, పార్కింగ్ ప్రదేశాలు తదితర అంశాలపై చర్చించారు. సామాన్య భక్తులకు మెరుగైన దర్శన వసతి సదుపాయాలను అందించడంలో సహాయ సహకారాలను అందించాలన్నారు. నూతనంగా ప్రవేశపెట్టిన , అక్టోబరు 31వ తేదీన జరిగే కృష్ణమ్మహారతి, నవంబరు 14న జరిగే కోటి దీపోత్సవం, నవంబరు 18వ తేదీన జరిగే తెప్పోత్సవం ఏర్పాట్లను కూడా పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు.
ఈ కార్యక్రమములో పలు విభాగాధిపతులు, పర్యవేక్షకులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు.
