×

భక్తులకు  సౌకర్యాల కల్పనపై   ప్రత్యేక శ్రద్ధ-రెడ్డివారి చక్రపాణిరెడ్డి

భక్తులకు  సౌకర్యాల కల్పనపై   ప్రత్యేక శ్రద్ధ-రెడ్డివారి చక్రపాణిరెడ్డి

శ్రీశైల దేవస్థానం: శ్రీశైలక్షేత్రాన్ని దర్శించే భక్తులకు  సౌకర్యాల కల్పనపై   ప్రత్యేక శ్రద్ధ చూపుతామని  ధర్మకర్తల మండలి అధ్యక్షులు  రెడ్డివారి చక్రపాణిరెడ్డి అన్నారు.పరిపాలనా కార్యాలయం లో తమకు కేటాయించిన చాంబరులో కి   గురువారం సంప్రదాయరీతిన  అధ్యక్షులు  ప్రవేశించారు.ఈ కార్యక్రమం లో స్థానిక  శాసనసభ్యులు  శిల్పా చక్రపాణిరెడ్డి పాల్గొన్నారు. చాంబర్ లో  గణపతిపూజ, శ్రీస్వామి అమ్మవార్ల చిత్రపటానికి పూజాదికాలు జరిపారు . ధర్మకర్తల మండలి సభ్యులకు కేటాయించిన గదిలో కూడా గణపతి పూజ, శ్రీస్వామి అమ్మవార్ల చిత్రపటానికి పూజాదికాలు జరిగాయి. ధర్మకర్తల మండలి అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామి వార్ల ఆశీస్సులతో దేశం, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.   శాసన సభ్యుల   సహకారంతో క్షేత్రాభివృద్ధికి తమవంతు కృషి చేస్తామన్నారు. దేవస్థాన ధర్మకర్తల మండలిలో తమకు అవకాశం కల్పించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి  ధన్యవాదాలు తెలియజేశారు. 

కార్యక్రమంలో  ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీమతి జి.ఎం. విజయలక్ష్మి సుబ్బరాయుడు,  ఎ. మురళి,  మేరాజోత్ హనుమంతనాయక్,  ప్రత్యేక ఆహ్వానితులు తన్నీరు ధర్మరాజు,  కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి పాల్గొన్నారు.

 ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు మురళీ బాలకృష్ణ, దేవస్థాన సహాయ కార్యనిర్వహణాధికారి , సహాయ కమీషనర్ (ఐ/సి) పి.నటరాజరావు, ప్రజాసంబంధాల అధికారి టి.శ్రీనివాసరావు, పర్యవేక్షకులు బి. మల్లికార్జునరెడ్డి, డి.రాధకృష్ణ, ఎన్. శ్రీహరి, ముఖ్యభద్రతా అధికారి నరసింహరెడ్డి, సీనియర్ అసిస్టెంట్ ఎం. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

నిర్మాణ పనుల పరిశీలన:

 ధర్మకర్తల మండలి అధ్యక్షులు, గణేశ సదన్ నిర్మాణ పనులను పరిశీలించారు.ఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు  తన్నీరు ధర్మరాజు కూడా పాల్గొన్నారు.

 ధర్మకర్తల మండలి అధ్యక్షుల  మాట్లాడుతూ  గణేశసదన్ ఫినిషింగ్ పనులను వీలైనంత త్వరలో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.తరువాత కొత్త పెట్రోల్ బంకు ఎదురుగా డార్మెటరీ హాళ్ళను ( పిలిగ్రీమ్ షెడ్లను)  పరిశీలించారు. టాయిలెట్స్ బ్లాకులు (శౌచాలయాలు, స్నానగదుల సముదాయాలు) నిర్మించేందుకు ప్రతిపాదించిన ఆయా ప్రదేశాలను కూడా అధ్యక్షులు పరిశీలించారు.బాహ్యరహదారి వద్ద  పార్కింగ్ ప్రదేశాల వద్ద, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వద్ద ( పాత హెలిప్యాడ్ ప్రాంతం) ఆర్.టి.సి. బస్టాండ్ మొదలైన చోట్ల టాయిలెట్స్ బ్లాకులు నిర్మించాలని ప్రతిపాదించారు.మల్లికార్జున సదనంలో  కూడా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పరిశీలించారు.

ఈ పరిశీలనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. మురళీబాలకృష్ణ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు నరసింహారెడ్డి, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు రాజారావు, ప్రణయ్ , ఎడిటర్ డా.సి.అనిల్ కుమార్  తదితర సిబ్బంది పాల్గొన్నారు.

print

Post Comment

You May Have Missed