కుల మత వర్గాలకు అతీతంగా సర్వజనుల హితమే తన మతమని చాటిన
మహాత్మాగాంధీ ఆదర్శాలు భారతదేశానికి తక్షణావసరమని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్
రావు అన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి (అమరవీరుల దినోత్సవం) సందర్భంగా
సీఎం కేసీఆర్ ఆయనను స్మరించుకున్నారు. జాతి సమగ్రతను, ఐక్యతను నిలబెట్టేందుకు తన
జీవితాన్ని అర్పించిన మహాత్మగాంధీ ఈ దేశ పురోగమనానికి సదా ఓ దిక్సూచీలా నిలుస్తారని
సీఎం పేర్కొన్నారు.నమ్మిన లక్ష్యాన్ని చేరుకునే క్రమంలో ఎదురయ్యే ఆటంకాలను లెక్క చేయకుండా
వొక్కొక్కటిగా అధిగమిస్తూ విజయతీరాలకు చేరాలనే స్పూర్తిని, గాంధీ జీవితం నుంచి ప్రతి
వొక్కరూ నేర్చుకోవాల్సి ఉందన్నారు. గాంధీజీ ఆశయాల వెలుగులో ముందుకు సాగుతామని
సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.