Governor Dr. Tamilisai Soundararajan expresses deep shock and anguish at the demise of Indian poet, revolutionary balladeer, and activist GADDAR @Gummadi Vittal Rao

The Governor stated that with his passing, the Telangana State has lost a legendary poet and activist, who left an indelible mark with his remarkable poetic style and leadership skills.

His significant contribution during the  agitation time for Telangana’s statehood and in politics as the Praja Yuddanauka will be remembered forever.

The Governor extends heartfelt condolences to the bereaved family members and followers.

దివి కేగిన అరుణ తార
– తుది శ్వాస వరకు ప్రజా గొంతుకగా గళమెత్తిన గద్దర్

– పోరు తెలంగాణ మా పాటతో మలిదశ ఉద్యమంలో స్ఫూర్తిని రగిలించిన ప్రజా యుద్ధనౌక

ప్రముఖ విప్లవ కవి, ప్రజా గాయకుడు ప్రజా యుద్ధ నౌక గద్దర్@గుమ్మడి విట్టల్ (75) కన్నుమూశారు. కొద్దికాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనకు అపోలో హాస్పిటల్‌లో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆదివారం పరిస్థితి విషమించడంతో తుదిశ్వాసం విడిచారు.
ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికారికంగా వెల్లడించారు.
గద్దర్ అసలు పేరు విఠల్ రావు. అందరికీ గద్దర్‌గా సుపరిచితులైన ఆయన అసలు పేరు గుమ్మడి విఠల్ రావు.
గద్దర్ మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామంలో దళిత కుటుంబంలో జన్మించారు.
తల్లి పేరు లచ్చమ్మ, తండ్రిపేరు శేషయ్య.
నిజామాబాదు జిల్లా మహబూబ్‌నగర్‌, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ విద్య అభ్యసించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. ఉద్యమ సమయంలో ఊరురా తిరిగి ప్రచారం చేశారు.
ఇందుకోసం ఆయన బుర్రకథను ఎంచుకున్నారు. ఆయన ప్రదర్శనను చూసిన సినిమా దర్శకులు బి.నరసింగరావు భగత్ సింగ్ జయంతి రోజున ఒక ప్రదర్శనకు అవకాశమిచ్చారు.
ఆ తర్వాత ప్రతీ ఆదివారం ఆయన తన ప్రదర్శనలు ఇచ్చేవారు. 1971లో బి.నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట “ఆపర రిక్షా” పాట రాశారు.
ఆయన మొదటి ఆల్బం పేరు గద్దర్. ఇదే ఆయన పేరుగా స్థిరపడింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరు తెలంగాణమా కోట్లాది ప్రాణమా అంటూ గద్దర్ దళమెత్తి పాడిన పాట ఉద్యమ స్ఫూర్తిని తెలంగాణ ప్రజల ఆకాంక్షను ప్రతిబింబించేలా ప్రజల్లో చైతన్యాన్ని నింపిoది. ఆయన దేశంలో రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించేలా తన భావాలను ప్రచారం చేసుకుంటూ రాజకీయ పార్టీలలో అందరివాడిగా అడుగులు వేస్తున్నాడు.
కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స చేయించుకునేందుకు వెళ్తున్న క్రమంలో భావోద్వేగ మైన మాటలను సందేశాన్ని వెల్లడించారు. తిరిగి గద్దర్ ఆరోగ్యంగా మళ్ళీ ప్రజాజీవనంలో పోరాట బాటలో అడుగులేస్తారని
ఆయన అభిమానులు ఉద్యమకారులు కళాకారులు కవులు ఆశగా ఎదురు చూస్తున్న క్రమంలో ఆయన తుది శ్వాస విడవడం తెలంగాణ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది.(Chintala Laxman)

గద్దర్‌ మరణం బాధాకరం

సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ

అమరావతి:ప్రముఖ ప్రజా గాయకుడు గద్దర్‌ మరణం పట్ల సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ ప్రగాఢ సంతాపం తెలిపారు. గద్దర్‌కూ, నాకూ ఎంతో సన్నిహిత సంబంధముందన్నారు. నాడు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోను గద్దరూ, తాను కలిసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించామని, ఆ ప్రాంత బొగ్గు కార్మిక ప్రాంతాలకూ వెళ్లామని గుర్తుచేశారు. ఆ విధంగా గద్దర్‌కూ, నాకూ సానిహిత్యం ఉందన్నారు. గద్దర్‌ విప్లవ పోరాటంలో ప్రముఖమైన పాత్ర పోషించారని, లెఫ్ట్‌ డెమోక్రిటిట్‌ ఉద్యమాలను, ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో ఆయన ఘన  పాత్ర పోషించారని  కొనియాడారు. పొడుస్తున్నపొద్దుమీద…నడస్తున్న కాలమా… అనే గేయం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మారుమ్రోగిందన్నారు. అలాంటి ఉత్తేజకరమైన నాయకుడు గద్దర్‌ హఠాన్మరణం చాలా బాధకరమని, వారి మరణం పట్ల సీపీఐ ప్రగాఢ సంతాపం తెలియజేస్తోందన్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్‌ను ఒక రాష్ట్ర ప్రముఖుడిగా గుర్తించి, ఆయన పేరిట ఒక మెమోరియల్‌ సంస్థ ఏర్పాటు చేసి, గద్దర్‌ సేవలను చిరకాలం గుర్తుండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నారాయణ సూచించారు.

ప్రజా గాయకుడు గద్దర్ మృతి తీవ్ర విషాదం:బైరెడ్డి రాజశేఖరరెడ్డి
కర్నూలు: ఎన్నో విప్లవ గీతాలు వినిపించి ప్రత్యేక తెలంగాణ సాధనకు కృషి చేసిన ప్రజా గాయకుడు గద్దర్ మృతి తీరని విషాదం అని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖరరెడ్డి విచారం  వ్యక్తం చేశారు. గద్దర్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.  ప్రజా గాయకుడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసమే కాకుండా వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఎన్నో పాటలు పాడి పాలకులు మేలుకొనెలా చేశారన్నారు. ప్రత్యేకంగా రాయలసీమ వెనుకబాటుతనం పై మేము చేసిన ధర్నాలు, దీక్షల్లో పాల్గొని మాకు అండగా నిలిచారు అని తెలిపారు. గద్దర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామన్నారు.

అభిమానుల నివాళి:

నీ పాదం మీద పుట్టుమచ్చనే చెల్లెమ్మా అంటూ మన తెలంగాణాలో ఉన్న ఆడబిడ్డకిచ్చే ఒక ప్రత్యేకతను చాటిచెప్పిన వైతాళికుడు. ఏ పక్షాని కైనా  ప్రశ్నిం చే గొంతుగా మారిన వ్యక్తిత్వం. నాలుగు కూడళ్ళే వేదికగా, ఈ భూమాత రంగస్థలంగా, ఒక గొంగడి, పాతపంచెయే గోచీ గా మరచిపోలేని సామాన్యజనంలోని ఆ ఆహార్యానికి ఇంకా ఏం అలంకారాలూ లేవు. శ్రద్ధాంజలి.

*యుద్ధనౌక..

తెలంగాణ కే నీ పదం ప్రాణం,
తెలంగాణ ఉద్యమానికి నీ గొంతు జీవం,
పాటతోనే జీవితాంతం సమరం,
చైతన్యానికే నీ పొలికేకలు కిరణం,
తిరుగుబాటుకు జీవితం అంకితం,
తిరిగి రాని లోకాలకు గద్దర్ పయనం,
తెలంగాణ వున్నంత కాలం నీ పాట ప్రతిధ్వనిస్తూనే వుంటుంది,
కొమ్మా, రెమ్మల్లో నిరంతరం వినపిస్తూనే వుంటుంది.
ఆ గొంతుమూగబోయినా,
నీ గానమాగదు,
నీ పాట ప్రయాణం ఎప్పటికీ ఆగిపోదు.
‌‌‌‌‌ _గాజుల.

print

By Online News Diary

ONLINENEWSDIARY.COM - A Multilingual Online News Portal

Leave a Reply

Your email address will not be published.