
శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) ఆదివారం పి. లలిత, బృందం హైదరాబాదు వారు భక్తిసంగీత విభావరి కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం కార్యక్రమం జరిగింది.
గణపతి ప్రార్థన, శివాష్టకం, జయ శివశంకర, శివస్తోత్రం, శ్రీశైలవాస, శంకరా ఓ శంకర మొదలైన పలుకీర్తనలను, అష్టకాలను, భక్తి గీతాలను యస్. సురేఖ, యస్. రమ్య, యమ్. సాయి సుధ, వి.కిరణ్మయి తదితరులు ఆలపించారు.