
శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా(నిత్య కళారాధన కార్యక్రమం) గురువారం సి. నాగలక్ష్మి ,బృందం అనంతపురం వారు భక్తిసంగీత విభావరి కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం 6 గంటల నుండి భక్తి సంగీత విభావరి కార్యక్రమం జరిగింది.
కార్యక్రమం లో గణపతి ప్రార్థన, శ్రీశైలవాస, శంకరా ఓ శంకరా పలు అష్టకాలను, భక్తి గీతాలను సి. నాగలక్ష్మీ, సి.పోతులయ్య, జి. అంగమ్మ, సుబ్బమ్మ, జి. లక్ష్మీ దేవి తదితరులు ఆలపించారు.
9న వి. లీల, నాట్య తరంగిణి స్కూల్ అఫ్ డాన్స్, విశాఖపట్నం వారు సంప్రదాయ నృత్యం ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తుంది.