
శ్రీశైల దేవస్థానం:ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఆదివారం పి. సంతోష్, బృందం, జనగాం ఆంధ్రనాట్యం కార్యక్రమం సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో గణనాయక పూజ, మహాగణపతి, శివ కల్యాణం, గిరిజా కళ్యాణం, సంధ్య తాండవం, నమ: శివాయతే, నమో నమో నటరాజ తదితర గీతాలకు యమ్. శ్రీ నిత్య, ఎం.శ్రీహిత, జాగృతి, ఎ.సాహితీ, ఎ.హర్షిత, ఎ. చందన, టి.శ్రీజ, కె. విద్యా, వి.సుమన, ఎస్.సాహితి, ఎం.నిహారిక, పి.దీక్షితా, జె. వైష్ణవి, సి. శ్రావణ, కె. శృతి, బి.సింధు, ఎ.సంతోష్, కె.సృజన తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
రెండో కార్యక్రమం లో భాగంగా కె. వెంకటేశ్వర్లు, జనగాం బృందం, వరంగల్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఈ కార్యక్రమం లో విజ్ఞా రాజం భజే, శివాష్టకం, శివస్తుతి, ఓం శివోహం, శివుడు తాండవమాడెను, నమ:శివాయతే, శివ కల్యాణం తదితర గీతాలకు టి.హరిణి, ఎం. అన్విత, టి.దీప్తిశ్రీ, ఎ.ప్రసన్న, జి.శ్రీవర్ధిని, శ్రీచందన, వి.మిథున, వి. అపర్ణ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
సోమవారం కార్యక్రమాలు:
28 న ప్రతిమ సునీల్ కుమార్, శ్రీ కళారాధన భరతనాట్య నృత్యశాల, బృందం, కనిగిరి భరతనాట్యం, శ్రీ జ్యోతి, శ్రీ కళారాధన భరతనాట్య నృత్యశాల, బృందం, చిత్రదుర్గ జిల్లా వారు భరతనాట్యం కార్యక్రమాలు సమర్పిస్తారు.