శ్రీశైల దేవస్థానం: దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (28.11.2021)
జోస్యుల శ్రీరామచంద్రమూర్తి, విజయవాడ బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.
ఈ కార్యక్రమం లో శివతాండవం, తిల్లాన, నటనమాడినార్, పుష్పాంజలి, శివ శివయనరాద, తదితర గీతాలకు ఆర్. ఎస్. భార్గవి, లాస్య ప్రవళ్లిక, తన్మయ్, జాహ్నవి, శ్రీనిధి తదితరులు నృత్య ప్రదర్శనను సమర్పించారు. ఈ కార్యక్రమానికి గాత్ర సహకారాన్ని జె. శ్రీ రామచంద్రమూర్తి , తబల సహకారాన్ని శాస్త్రి, వయోలిన్ సహకారాన్ని దక్షిణామూర్తి అందించారు. రెండవ కార్యక్రమం గా శ్రీ బాల త్రిపురసుందరి నృత్యనికేతన్ కూచిపూడి నాట్యశాల, కాకినాడ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమములో శివాష్టకమ్, శివపంచాక్షరి, మూషికవాహన, అయిగిరినందిని, శివతాండవం, గిరిజా కల్యాణం తదితర గీతాలకు ఎ. శివరంజని, ఎ. ప్రణవిసాయి, ఎం అక్షయభావన, టి. దేవిశ్రీలక్ష్మీ ప్రసన్న, టి. ఉషపావని, ఎం. నిహరికరెడ్డి, పి. హాసిని, ఎం.ఫణిశ్రీ సంధ్యలు నృత్య ప్రదర్శన చేయగా , గిరిజా కల్యాణం నృత్య రూపకానికి శ్రీమతి అరుణ, శ్రీమతి నాగసూర్య లావణ్య, శ్వేతారెడ్డి, భానువెంకటపద్మ, జి.శ్రీను, వైష్ణవి, భాస్కర్ అజయ్, జాహ్నవి, నిత్యుషా, లోహిత, దేవిశ్రీ, రీతుశ్రీ, కుందనశ్రీ, దేవిశ్రీ, సాయి కల్యాణిలు తదితరులు నృత్య ప్రదర్శనను సమర్పించారు.
రేపటి నిత్య కళారాధన:
రేపు (29.11.2021) న శ్రీ శివసాయి కళానిలయం, నెల్లూరు వారు సంప్రదాయనృత్యం, శ్రీమారుతి భజన మండలి, హైదరాబాద్ వారు భజన కార్యక్రమం సమర్పిస్తారు.
పుష్కరిణి వద్ద లక్షదీపోత్సవ కార్యక్రమం సందర్భంగా కార్తిక దీపోత్సవంపై ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేసారు.