శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (23.11.2021) నటరాజ నృత్య సమితి, విశాఖపట్నం బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ భక్తి రంజని కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమం లో వినాయకకౌత్వం, మూషిక వాహన, భో.. శంభో, ఏకదంతాయ, చంద్రచూడ శివశంకర, అయిగిరి నందిని తదితర గీతాలకు సారిక, వంశీకృతి, శ్లోక, అక్షయ, వెన్నెల, అవంతిక, పరిణిక, శరజ,క్రితి, రూషితి తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
కాగా ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నార.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని మరియు ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు చేస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు అనగా జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
| రేపటి నిత్య కళారాధన ||
రేపు (24.11.2021) యం.వి.యల్ చంద్రిక, విజయవాడ బృందం వారు సంప్రదాయ నృత్యం మరియు టి. సందీప్ కుమార్, విశాఖపట్నం అండ్ బృందం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తారు.