
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) ఆదివారం డా. టి. బాబు, బృందం, బెంగుళూరు, కర్ణాటక రాష్ట్రం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం ఈ ప్రదర్శన జరిగింది.
కార్యక్రమం లో మహాగణపతిం, భో..శంభో, శంకరాభరణం, హరహరశంకర, బ్రహ్మమురారి, లింగాష్టకం, తదితర గీతాలకు డా. ప్రియశక్తి, ఎన్. సంజన, ఎం.జి. సమిత, ఎం. ఎన్. హర్షిత, సి. మేఘశ్రీ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
నాదస్వర సహకారాన్ని డా. టి. బాబు, డా. ఆర్. సురేష్, సాక్సాఫోన్ సహకారాన్ని సి. బాలాజి, తబలా సహకారాన్ని బి.ఎస్. వెంకటేష్అందించారు.
శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన నిర్వహిస్తున్నారు.