
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) గురువారం శ్రీమతి విజయవాణి, శ్రీ శారదా ఎకాడమీ, హైదరాబాద్ వారి బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం గం.6:00 ని||ల నుండి కార్యక్రమం ఏర్పాటు చేసారు.కార్యక్రమం లో మహాగణపతిం, వినాయక కౌత్వం, శివతాండవం, అంబపరాకు, శివతరంగం, మహిషాసురమర్ధిని తదితర గీతాలకు అభిరామ్, లాస్య, నిత్యశ్రీ, ఆరోహి, కామాక్షి త్రిపురశ్రీ, తేజస్విణి, ద్రితిక, లోకజ్జ, నిషక శరణ్య, లక్ష్మీ సహస్ర, దేవిశ్రీ, భువనకృతి, మనోజ్ఞ, అర్యన్ రామశర్మ, అభిరామ్ శర్మ, మైత్రేయి తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
శుక్రవారం సాంస్కృతిక కార్యక్రమాలు:
వై. సీతరామరాజు, కర్నూలు బృందం హరికథ కార్యక్రమం సమర్పిస్తుంది.