
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) శనివారం శ్రీమతి సంధ్యకార్తిక్ హైదరాబాద్ బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద సాయంకాలం గం.6:00 ని||ల నుండి సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. కార్యక్రమం లో తాండవ నృత్యకేళి, శివాష్టకం, బ్రహ్మాంజలి, నాట్యహేల, కామాక్షిస్తుతి, ఆనందతాండవం,నటేశకౌత్వం తదితర గీతాలకు మధుస్మిత, మైథిల్య, సాత్విక, స్ఫూర్తి, భవ్య, నమ్య, సంధ్య, ఉదయ్, సాన్విశ్రీ, మహాలక్ష్మి సురభిదీప్తి, విద్య తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
రేపటి సాంస్కృతిక కార్యక్రమాలు:
ఆదివారం కుమారి శ్రీవల్లి బృందం, నంద్యాల వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.