భక్తి గీతాలకు భవ్య నృత్య ప్రదర్శన
- శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (19.10.2021)న శ్రీమతి వేదాంతం కామాక్షి, శ్రీబాలాత్రిపురసుందరి నృత్య నికేతన్, నెల్లూరు వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం చిత్రావళి.
- Kumara Swamy Puuja,Bayalu veerabadra swamy puuja , Nandeeswara swamy vari puuja performed in the temple.
- శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (19.10.2021) శ్రీ బాల త్రిపురసుందరి కూచిపూడి నృత్యనికేతన్, నెల్లూరు వారిచే కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో శివాష్టకం, భోశంభో, శివస్తుతి, అఖిలాండేశ్వరి, అన్నపూర్ణాదేవి ఏకదంతాయం , లక్ష్మీ అష్టకం, అయిగిరి నందిని తదితర గీతాలకు మారిన నక్షత్ర,లంక సుదీప్తి,రామిశెట్టి మానసి,మైలం శ్రీదుర్గ ,లక్ష్మీ జాహ్నవి , హాసిని క్రియ ఎన్.నవ్య, కె.చరితాశ్రీ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసారు.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు, జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
రేపటి నిత్య కళారాధన:
రేపు (20.10.2021)న వై.నాగరాజు, పార్వతీనగర్, మైదుకూరు వారిచే హరికథ కార్యక్రమం ఏర్పాటు చేసారు.
Post Comment