
శ్రీశైల దేవస్థానం: ధర్మపథంలో భాగంగా (నిత్యకళారాధన కార్యక్రమం) శుక్రవారం ద్రోణ ఇనిస్ట్యూట్ ఆఫ్ డ్యా న్స్, మహబూబ్ నగర్ వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్యం కార్యక్రమం జరిగింది.
మూషికవాహన, గణేశకౌత్వం, లింగాష్టకం,మహేశ్వరి, శంభో శివశంభో, ఓం నమ:శివాయ, శివతాండవం తదితర గీతాలకు స్వప్న, ఎం. దివ్య, బి. భావన, పి. మహాలక్ష్మి బి. మహిత, డి. అపూర్వ, కె. ప్రతిక, టి. శరణ్య, బి. శ్రీనిధి, కె. మనోజ్ఞ, జె.లాస్య, ఆశ్రిత, ఎస్. రిథిక, కె. వర్షిణి, ఎం. అమృతవర్షిణి తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు
శనివారం శ్రీమతి డి. రాధిక, బృందం, అనంతపురం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పిస్తారు.