
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం) ఆదివారం శ్రీకృష్ణసంగీత నృత్యకళాశాల, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమం లో ఆనంద నర్తన గణపతిం, ఆనందతాండవమాడే, అఖిలాండేశ్వరి, శివగంగ నృత్యరూపకం మొదలైన అంశాలకు నాట్య విజ్ఞాన్ పి. జ్వాలాముఖి ఆధ్వర్యములో వర్షిణి, మాల్యద, త్రిష, మేఘన, ప్రణవి, వైష్ణవి, ఆరాధ్య, ఉదయ మనస్వి, డా. శ్రావణి కౌముది, శ్రీమతి అఖిల, అఖిలేష్, రచన తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
సోమవారం సాంస్కృతిక కార్యక్రమాలు
సోమవారం శ్రీ నటరాజ నృత్య కళాశాల, శ్రీశైలం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం వుంటుంది.