
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (25.11.2021) యం.వి.యల్. సత్యవాణి, విజయవాడ బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో నర్తన గణపతి, తాండవ నృత్యకరీ, శివ శివ యనరాదా, శివపంచాక్షరీ, శివస్తుతి, లింగాష్టకమ్, కాలబైరవాష్టకమ్, రావణాష్టకమ్ తదితర గీతాలకు సాత్విక, ఝాన్సీరాణి, లాస్యశ్రీ, దుర్గాశ్రావణి, పల్లవి, ఉజ్జ్వలసాయి, శోభిల అనిత, లౌక్య, కణ్వలాదేవి తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
రెండవ కార్యక్రమం గా శ్రీ నృత్య కళాంజలి డాన్స్ అకాడమీ, విశాఖపట్నం వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఈ కార్యక్రమం లో మహాగణపతిం, ఈశా గిరీశా.. మూషికవాహన, ఓంనమఃశివాయ, పుష్పాంజలి, యోగీశ్వరాయ, శివపంచాక్షరీ మంత్రం, ప్రాణవం ప్రణావకారం, నమశ్శివాయచ తదితర గీతాలకు నివేదిత, బిందు ప్రణవి, ఆరాధ్య, రోషిణి, దీక్షిత, మేఘన, స్వప్న, శ్రీభువనశ్రీ, సాత్విక, ధాత్రిచి, కిరణ్మయ్, హాసిని, గౌతమ్ భరద్వాజ్ తదితరులు నృత్య ప్రదర్శనను సమర్పించారు.
ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు అనగా జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
| రేపటి నిత్య కళారాధన ||
రేపు (26.11.2021)న శ్రీనృత్యకళాంజలి డ్యా న్స్ అకాడమీ, విశాఖపట్నం అండ్ బృందం వారిచే సంప్రదాయనృత్యం , లలిత కూచిపూడి డాన్స్ అకాడమీ, విశాఖపట్నం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.