
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈరోజు (04.01.2022) ఉష శివడ్యాన్స్ అకాడమీ, శ్రీశైలం ప్రాజెక్టు కాలనీ బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
ఈ కార్యక్రమం లో గణపతిం, వినాయకౌత్వం, గరుడగమన, శివతాండవం,శివాష్టకం, అయిగిరినందిని తదితర గీతాలకు కె. చైత్ర, ఎస్. వేదశ్రీ, సి.హెచ్. లాలిత్య, సి.హెచ్ భాగ్యశ్రీ, జి. శ్రావణి, కె. భవ్యజ్ఞ, డి. యశస్వీ, ఎం.
జయశ్రీ, జి. ప్రణవి, ఇ.సాన్విక్ తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
| రేపటి నిత్య కళారాధన
రేపు (05.01.2022) శ్రీదేవి సంగీత నృత్యనికేతన్, హైదరాబాద్ వారి బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.