
శ్రీశైల దేవస్థానం:శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈ రోజు (15.11.2021) న శ్రీ అభినయ నాగజ్యోతి, వారి బృందం, న్యూఢిల్లీ వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ సంప్రదాయనృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో వినాయక కౌత్వం, లింగాష్టకం, శివతరంగం, శివాష్టకం, జతిస్వరం, సరస్వతి వందనం తదితర గీతాలకు సీతా నాగజ్యోతి, పి. నాగజ్యోతి, అభినయ నాగజ్యోతి, శ్రీతనయ శర్మ, సాయి శిరిష,భమిడి, అపర్ణారెడ్డి తదితరులు నృత్య ప్రదర్శనను సమర్పించారు.
రెండవ కార్యక్రమముగా లిఖితా శ్రీ నృత్య కళాశాల, నందికొట్కూరు వారి బృందంచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమములో మహాగణపతిం,శంకర శశిధర, నమశ్శివాయ రగడ, అనందతాండవం, బో..శంభో,
జయ జయ దుర్గ, శివస్తుతి తదితర గీతాలకు సాయిలిశితాశ్రీ, సాయిజశ్విత్, మేఘన, మల్లిశ్వర తదితరులు నృత్యప్రదర్శనను సమర్పించారు.
| కార్తీకదీపోత్సవం పై ప్రవచన కార్యక్రమం:
కార్తికమాసం ధార్మిక కార్యక్రమాలలో భాగంగా ఈ రోజు (15.11.2021) కార్తిక రెండవ సోమవారం సందర్భంగా పుష్కరిణీ వద్ద కార్తీక దీపోత్సవంపై ప్రవచన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసారు.
ఈ ప్రవచన కార్యక్రమంలో డా. దీవి హయగ్రీవచార్య, నంద్యాల వారిచే కార్తీకదీపోత్సవంపై ప్రవచనాన్ని చేసారు.
రేపటి నిత్య కళారాధన ||
రేపు (16.11.2021) శ్రీమతి సుందరి రవిచంద్ర మరియు వారి బృందం, సికింద్రాబాద్ వారిచే సంప్రదాయనృత్యం మరియు జి. రవి మరియు వారి బృందం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం ఏర్పాటు చేసారు.
* Donation of Rs .1,16,000/- for Annadanam by R.Ramesh, Nizampet, Hyderabad donated Rs .1,16,000/- for Annadanam scheme.