ఆధ్యాత్మిక గీతాలకు సంప్రదాయ నృత్య ప్రదర్శన
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న “నిత్యకళారాధన” (నివేదన) కార్యక్రమంలో భాగంగా ఈరోజు (27.10.2021) డి. సాయిజక్షిత్ బృందం, నందికొట్కూరు వారు సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం సమర్పించారు.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:30 ని||ల నుండి ఈ భరటనాట్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో ఏకదంతాయ, ఓం నమఃశివాయ తే, భో..శంభో, శంభో, బ్రహ్మాంజలి, అష్టపది, తరంగం, ఆనందతాండవం, శివాష్టకం, శంకర శశిధర తదితర గీతాలకు డి. సాయిజక్షిత్, శ్రీ సాయి లిక్షతా శ్రీ తదితరులు నృత్య ప్రదర్శనను చేసారు.
ఈ నిత్య కళారాధనలో ప్రతి రోజూ హరికథ, బుర్రకథ, సంప్రదాయ నృత్యం, వాయిద్య సంగీతం, భక్తిరంజని లాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు.
శ్రీ స్వామి అమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని, ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ నిత్య కళారాధన (నివేదన) కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమాలలో ముఖ్యంగా స్థానిక కళాకారులకు, జిల్లాలోని కళాకారులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
| రేపటి నిత్య కళారాధన ||
రేపు (28.10.2021)న వై.జయకృష్ణ, మైదుకూరు, కర్నూలు జిల్లా వారిచే హరికథ కార్యక్రమం వుంటుంది.
Post Comment