శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమం ) శనివారం శ్రీమతి శ్రావ్య బృందం, హైదరాబాద్ సంప్రదాయ నృత్య ప్రదర్శన సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమాలు జరిగాయి.కార్యక్రమములో వినాయకౌత్వం, మూషికవాహన, అర్ధనారీశ్వరం, నాగేంద్రహారాయ తదితర గీతాలకు బండారు శ్రావ్య ఆధ్వర్యములో ఓరుగంటి భవ్య, నిత్య, మేథ, అనైక, మౌక్తిక, త్రిగుణ తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.