
శ్రీశైల దేవస్థానం: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంలో భాగంగా) ఈ రోజు (27.12.2021) నృత్యాంజలి స్పిరిట్ ఆఫ్ ఆర్ట్ అకాడమీ, విశాఖపట్నం వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వద్ద ఈ రోజు సాయంకాలం గం.6:00 ని||ల నుండి సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో భజే విఘ్నరాజం, ఆనంద నర్తన గణపతిం, గణపతి తాళం, నటరాజ కౌత్వం, శివాష్టకం, రావణాష్టకం తదితర గీతాలకు హెచ్.కె.కె. చైతన్యప్రభు, పి. యశ్వితవర్మ, హెచ్.ఎస్.పి.ఎస్. శ్రావణి, ఎన్.ఎస్.ఎస్. వైష్ణవి, ఎన్. అనన్య, బి. నిశిత, ఆర్ అక్షిత, ఎన్. జోషిత తదితరులు నృత్య ప్రదర్శన చేసారు.
రేపటి నిత్య కళారాధన
రేపు (28.12.2021) కుమారి పి.ఉదయశ్రీ, మహబూబ్ నగర్ జిల్లా వారిచే సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం వుంటుంది.