
శ్రీశైల దేవస్థానం:దేవస్థానం నిర్వహిస్తున్న ధర్మపథంలో భాగంగా (నిత్య కళారాధన కార్యక్రమంగా) ఆదివారం ఎం.మధుమతి హైదరాబాద్ బృందం సంప్రదాయ నృత్య ప్రదర్శనను సమర్పించింది.ఆలయ దక్షిణ మాడవీధిలోని నిత్యకళారాధన వేదిక వద్ద ఈ రోజు సాయంకాలం నుండి ఈ సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమం లో మహాగణపతి ప్రార్ధన, శివతాండవం, శంభో…శివశంభో, నమఃశ్శివాయ,శివాష్టకం, తదితర.గీతాలకు శ్రీమతిమధుమతి,సాహిత్య,శ్రీవల్లి, అంత.సంధ్య. కళ్యాణి, నిశిత,సహస్ర,లాస్య,స్వరూప,సుదీప్తి,జనన్య, చైత్ర,ఆర్య,తదితరులు నృత్య ప్రదర్శన చేసారు. శ్రీ స్వామిఅమ్మవార్లకు ఆయా కైంకర్యాలన్నీ పరిపూర్ణంగా జరగాలని , ప్రాచీన సంప్రదాయ కళల పరిరక్షణలో భాగంగా ఈ ధర్మపథం కార్యక్రమాలు జరుగుతున్నాయి.
సోమవారం సాంస్కృతిక కార్యక్రమాలు:
డి. చిన్న, శ్రీ సాయినటరాజ డ్యా న్స్ అకాడమి,కడప బృందం కూచిపూడి సంప్రదాయ నృత్య ప్రదర్శన కార్యక్రమం వుంటుంది.